“లియో” తో సినిమాటిక్ బ్లాస్ట్..మేకర్స్ అప్డేట్ 

ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్న పలు సౌత్ ఇండియా సినిమాల్లో తమిళ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ గా వస్తున్నా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “లియో” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రంలో దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించగా నెక్స్ట్ లెవెల్ లో అయితే ఈ చిత్రం పై సెన్సేషనల్ హైప్ నెలకొంది. తమిళ్ లో అయితే ఈ చిత్రం రికార్డు బిజినెస్ జరుపుకున్న సినిమాగా నిలిచింది. అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ సాధ్యమైనంత వరకు కూడా బిగ్ స్క్రీన్స్ లో అయితే ఒక అదిరిపోయే ఎక్స్ పీరియన్స్ ని అందించే ప్లాన్ లో ఉన్నారు.

మరి లేటెస్ట్ గా అయితే ఐమ్యాక్స్ వెర్షన్ కి గాను సాలిడ్ ప్లానింగ్ లు చేస్తున్నారు. ఈ వెర్షన్ లో అయితే సినిమాటిక్ బ్లాస్ట్ ని అందిస్తున్నామని ఓ క్రేజీ పోస్టర్ తో అయితే కన్ఫర్మ్ చేసారు. మరి మొత్తానికి అయితే కావాల్సిన హైప్ అంతా గట్టిగా ఎక్కిస్తున్నారు.

మరి ఫైనల్ గా అయితే ఈ చిత్రం ఎంత మేర హిట్ అవుతుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో అర్జున్ సార్జా అలాగే బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ తదితరులు నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు అలాగే అనిరుద్ క్రేజీ మ్యూజిక్ సంగీతం అందిస్తున్నాడు.