ఈ ఏడాది సౌత్ ఇండియా సినిమా దగ్గర ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన లేటెస్ట్ చిత్రాల్లో ఈ దసరా కానుకగా అయితే తమిళ్ సినిమా నుంచి వచ్చిన భారీ చిత్రం “లియో” కూడా ఒకటి. కాగా దళపతి విజయ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజు తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ నాట సెన్సేషనల్ ఓపెనింగ్స్ అందుకొని విజయ్ కెరీర్ లోనే ఒక ఊహించని రేంజ్ ఓపెనర్ గా నిలిచింది.
మరి మొదటి రోజే ఏకంగా 140 కోట్లకి ఒరిగా గ్రాస్ ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర 4 రోజులు కంప్లీట్ చేసుకోగా ఈ నాలుగు రోజుల్లో అయితే ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఏకంగా 400 కోట్ల వసూళ్లు రాబట్టేసింది. అంటే యావరేజ్ గా ఈ చిత్రం ప్రతి రోజు కూడా 100 కోట్ల గ్రాస్ ని టచ్ చేసింది.
దీంతో ఈ లియో సినిమాతో తమిళనాట ఒక సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా మొదటి వీకెండ్ కి అయితే లియో సినిమా 405.5 కోట్ల గ్రాస్ ని అందుకొని తమిళ నాట ఫాస్టెస్ట్ 400 కోట్ల గ్రాసింగ్ సినిమాగా నిలిచింది అని తెలుస్తుంది. దీనితో లియో సినిమా తమిళనాట ఒక సరికొత్త ట్రెండ్ సెట్టింగ్ సినిమాగా నిలవగా రీసెంట్ భారీ హిట్ జైలర్ ని క్రాస్ చేసే దిశగా ఇప్పుడు దూసుకెళ్తుంది.
ఇక దీనితో పాటుగా ఈ సినిమాకి మేజర్ గా ఓవర్సీస్ కలెక్షన్స్ లు భారీగా ప్లస్ అయ్యాయని కూడా చెప్పాలి. దీనితో ఈ సినిమా ఇప్పుడు విజయ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాగా నిలిచి ఇంకా రికార్డులు నమోదు చేసే దిశగా వెళ్తుంది.
https://x.com/SSMusicTweet/status/1716322880739528761?s=20