Big Boss Ajay: రోడ్డు ప్రమాదంలో కాళ్లు చేతులు పడిపోయాయి… బిగ్ బాస్ కంటెస్టెంట్ అజయ్!

Big Boss Ajay: బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎంత ఆదరణ పొందిందంటే ఈ షో కోసం రోజు మొత్తం వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ఇటీవల ముగిసిన బిగ్బాస్ సీజన్ గణనీయంగానే ముగిసింది. కానీ బిగ్ బాస్ ప్రియులు మాత్రం బిగ్బాస్ ఎందుకు అంత త్వరగా ముగిసిందని చాలా విచారం వ్యక్తం చేసారు. కానీ బిగ్ బాస్ నిర్వాహకులు ఒక కొత్త ఆలోచనను చేపట్టారు. బిగ్ బాస్ నేరుగా ఓటీటీ లో డిస్నీ హాట్ స్టార్ ప్లస్ లో ప్రసారమయ్యే లా ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని బిగ్ బాస్ ప్రియులు గుడ్ న్యూస్ గా భావించారు. కాగా నిన్న అనగా ఫిబ్రవరి 26న ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ షో నిర్వాహకులు అల్ లిమిటెడ్ గా 24 గంటలు ప్రసారమయ్యే లా ప్లాన్ చేశారు.

ఇక మొత్తం 84 రోజులు, 17 మంది కంటే సెంట్లు ఉంటారని నాగార్జున వెల్లడించారు. ఇక ఈ షో ను గత సీజన్లో పాల్గొన్న వారిని వారియర్స్ గా కొత్తగా వచ్చిన వారిని చాలెంజర్స్ గా విభజించారు. ఇక వీరి మధ్యే పోటీ ఉంటుందని ఈ షో హోస్ట్ నాగార్జున తెలిపాడు. ఇక హౌస్ లో ఫస్ట్ ఛాలెంజర్ గా అజయ్ అడుగుపెట్టాడు.తన గురించి చెప్పి షోలో అందర్నీ ఎమోషనల్ గా టచ్ చేశాడు. రెండు మూడు సినిమాలు చేశాను అంటూ అజయ్ తెలిపాడు. ఇక జీవితంలో హార్డ్ వర్క్, లక్ రెండు పని చేస్తాయని అజయ్ తెలిపాడు.

ఇక మొదటి సినిమా సినిమా ఆడిషన్‌కే సెలెక్ట్ అయిపోయాను. కానీ షూటింగ్ పూర్తి చేసుకుని వస్తున్న సమయంలో అనుకోకుండా ఓ ప్రమాదం జరిగింది.
ఆ ప్రమాదంలో దురదృష్టవశాత్తూ నా రెండు కాళ్లు చేతులు పడిపోయాయి. దాంతో దాదాపు ఎనిమిదేళ్ళు మంచంపైన ఉన్నానని అజయ్ తెలిపాడు. ఇక హౌస్ లో అజయ్ బుల్లితెర ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి.