లీకైన ఢీ13 విన్నర్.. ఎవరో తెలుసా?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఢీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ షో ఎంత అమితంగా ఇష్టపడతారో, అదేవిధంగా ఢీ షోను కూడా అంతే అమితంగా ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు.ఈ ఢీ షో ద్వారా ఇప్పటికే ఎంతో మంది కొరియోగ్రాఫర్లు, డాన్సర్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. శేఖర్ మాస్టర్ లాంటి మంచి మంచి కొరియోగ్రాఫర్లు ఈ స్టేజ్ నుంచి వచ్చిన వారే. అయితే బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వస్తున్నాయి..వెళుతున్నాయి.. కానీ ఢీ షో మాత్రం కొన్ని ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ ప్రస్తుతం 13వ సీజన్ ప్రారంభం అవుతోంది. తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఆఖరి దశకు చేరుకుంది. వచ్చే బుధవారం డిసెంబరు1 ఈ షో విన్నర్ ఎవరో తెలియనుంది.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మీ షో విన్నర్ ఎవరో తెలుసుకోవాలి అని ప్రేక్షకులు ఎంతగానో తాపత్రయపడుతున్నారు. ఇది ఇలా ఉంటే మళ్లీ వారం రాబోయే ఎపిసోడ్ కు సంబంధించి వీడియో లీక్ అయింది. దీంతో మళ్లీ వారం ఏ కంటెస్టెంట్ విన్నర్ అవుతుంది అన్నది ముందే తెలిసిపోయింది. ఈసారి ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో ఏ కంటెస్టెంట్ గెలిచిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ షోలో చివరగా కింగ్స్ సైడ్ సాయి, అలాగే కార్తీక్ గ్రాండ్ ఫినాలేలో పోటీ పడుతున్నారు. అలాగే క్వీన్స్ నుంచి నైనిక, కావ్యలు పోటీపడుతున్నారు. ఇక చివరిగా గ్రాండ్ ఫినాలీ లో కింగ్స్ తరఫునుంచి కార్తీక్, క్వీన్స్ తరఫునుంచి కావ్య పోటీ చేసారు. వీరిద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ జరిగిందని సమాచారం. ఇక చివరిగా ఈ సీజన్ టైటిల్ విన్నర్ కావ్య అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.