లీక్ షాక్ : “బాలయ్య 107” లో మరో షాకింగ్ లుక్ లీక్ వచ్చేసి వైరల్.!

టాలీవుడ్ పవర్ ఫుల్ మాస్ హీరోస్ లో నందమూరి నటసింహ బాలకృష్ణ కూడా ఒకరు. మరి బాలయ్యకి ఒక అదిరే హిట్ పడితే ఎలా ఉంటుందో తన లాస్ట్ భారీ హిట్ చిత్రం “అఖండ” తో చూపించాడు. ఇక దీని తర్వాత బాలయ్య తన కెరీర్ లో 107వ సినిమా చేస్తుండగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది.

మరి ఈ సినిమాపై కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొనగా షూటింగ్ ని చిత్ర బృందం శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన మొదట్లోనే జస్ట్ ఒకటి రెండు రోజుల్లోనే బాలయ్య లుక్ రివీల్ అయ్యిపోయి చిత్ర యూనిట్ కి షాకిచ్చింది.

మరి ఇప్పుడు వాటికి మించిన మరో సాలీడ్ లుక్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈసారి బాలయ్య తన పాత సినిమాల్లో తెల్లటి ఖద్దరు బట్టల్లో మంచి డైనమిక్ గా కనిపిస్తున్నాడు. ఫ్యాన్స్ తో ముచ్చట్లు పెట్టిన బాలయ్య ఫొటోలతో పాటుగా సెట్స్ లో కూడా కొన్ని ఫోటోలు, వీడియోలు లీకయ్యాయి.

దీనితో ఇవి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇంకా ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.