వరుణ్‌తేజ్‌తో ఎంగేజ్‌మెంట్ అయ్యాకా అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. హీరోయిన్‌గా అమ్మడు పెద్దగా పీకిందేమీ లేకపోయినప్పటికీ, మెగా కోడలు.. అనే ట్యాగ్ మాత్రం భలే ఈజీగా పట్టేసిందన్న జెలస్ చాలా మందిలో వుండనే వుంది.
అయితే, మెగా కోడలు అనే ట్యాగ్‌తో ఇకపై తన కెరీర్‌ని బిల్డప్ చేసుకోనుందా ఈ ముద్దుగుమ్మ.? అంటే అవుననే అంటున్నారు. వరుణ్ తేజ్‌తో ఎంగేజ్‌మెంట్ తర్వాత లావణ్యకు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. దాంతో, అమాంతం రెమ్యునరేషన్ కూడా పెంచేసిందట అమ్మడు.
అంతా బాగానే వుంది కానీ, అసలు పెళ్లి తర్వాత లావణ్య సినిమాల్లో నటిస్తుందా.? లేదా.? అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే, మెగా ఫ్యామిలీలో అలాంటి అభ్యంతరాలేమీ లేవనే చెప్పొచ్చు. నిహారిక సినిమాల్లోకి రావడానికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు.
అలాగే, సమంత, కాజల్ వంటి స్టార్ హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా సక్సెస్‌ఫుల్‌గా తమ కెరీర్‌ని కొనసాగిస్తున్నారు. సో, లావణ్య విషయంలోనూ అలాంటి అనుమానాలేం పెట్టుకోవల్సిన పని లేదు. దాదాపు కెరీర్ అటకెక్కేసిన టైమ్‌లో లావణ్య మెగా హీరోతో పెళ్లి ముచ్చట భలే వర్కవుట్ అయ్యింది.
ఆ క్రేజ్‌తోనే ఇప్పుడు మళ్లీ స్టార్‌డమ్ తెచ్చుకోబోతోంది. చూడాలి మరి, ఇకపై అందాల రాక్షసి కెరీర్ ఎలా వుండబోతోందో.!