లేటెస్ట్ – “వీరసింహా రెడ్డి” నుంచి న్యూయర్ క్రేజీ అనౌన్సమెంట్.!

నందమూరి నటసింహ టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మాస్ ఏక్షన్ డ్రామా చిత్రం “వీరసింహా రెడ్డి” కోసం తెలిసిందే. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన అయితే శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తుండగా ఈసినిమా పై మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు అయితే ఈ కొత్త సంవత్సరం కోసం చిత్ర యూనిట్ అదిరే ప్లానింగ్ లు చేస్తున్నారు.

మరి లేటెస్ట్ గా ఓ క్రేజీ అనౌన్సమెంట్ ఇస్తూ ఈ డిసెంబర్ 24 న “మా బావ మనోభావాలు” అనే సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఇది డెఫినెట్ గా హిట్ సాంగ్ అంటూ కాన్ఫిడెన్స్ అంటున్నారు. అలాగే ఈ సాంగ్ అయితే ఈ కొత్త సంవత్సరం పండగకి అదిరిపోతుంది.

అని అంతా స్పీకర్లు పట్టుకొని రెడీగా ఉండండి అంటూ చెప్తున్నారు. మరి ఈ బీట్ ని అయితే సంగీత దర్శకుడు థమన్ ఎలా ఇచ్చాడో చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు నటిస్తుండగా మైత్రి మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు అలాగే వచ్చే ఏడాది జనవరి 12న వీరసింహ రెడ్డి థియేటర్స్ లో రాబోతున్నాడు.