“హరిహర వీరమల్లు” సెట్స్ పీకేస్తున్నారట.?

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. మరి పవన్ ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో పవన్ స్టార్ట్ చేసిన మొదటి సినిమా ఇది కాగా ఇది తప్ప మిగతా సినిమాలు పవన్ చేసేస్తున్నారు.

దీనితో ఎప్పుడో స్టార్ట్ చేసిన ఈ సినిమా పత్తా లేకుండా పోయింది. కాగా దీనితో పాటుగా ఈ భారీ సినిమా పవన్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా పైగా పవన్ వారియర్ లుక్ లో కూడా మొదటి సినిమా కావడంతో ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా ఇప్పటికే భారీ సెట్టింగ్స్ వేసుకొని పవన్ షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే ఆల్రెడీ హైదరాబాద్ లో పలు భారీ సెట్టింగ్స్ మేకర్స్ వేసి ఉంచారు కానీ రోజులు గడిచిపోతున్నాయి. పవన్ మాత్రం రావడం లేదు. దీనితో ఇప్పుడు సినిమా సెట్టింగ్స్ ని మేకర్స్ తీసేస్తున్నారట. ఇప్పుడు హైదరాబాద్ లో వేసిన భారీ సెట్టింగ్స్ తీసేసి పవన్ కి వెసులుబాటు ప్రకారంలో ఏపీలో ఎక్కడో దగ్గర వేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

దీనితో ఈ సెట్టింగ్స్ అన్నీ ఏపీకి షిఫ్ట్ కానున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ భారీ చిత్రానికి అయితే కీరవాణి సంగీతం అందిస్తుండగా క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ చిత్రంలో ఉన్నారు.