లేటెస్ట్ : పవన్ “ఓజి” లో ఈ బోల్డ్ యాక్ట్రెస్ కూడా.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో యంగ్ దర్శకుడు సుజీత్ చేస్తున్న “ఓజి” ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ సినిమా కూడా ఒకటి. కాగా ఈ సినిమాపై మాసివ్ అంచనాలు ఉండగా ఈ సినిమా ఉన్న కొద్దీ మరింత గ్రాండ్ లెవెల్లోకి అయితే వెళ్తుంది.

కాగా ఈ చిత్రం ఇప్పుడు ఓ రేంజ్ లో అంచనాలు పెట్టుకోగా రీసెంట్ గానే ప్రముఖ తమిళ యంగ్ నటుడు అర్జున్ దాస్ నటిస్తున్నట్టుగా మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు మరో స్టన్నింగ్ నటి అయితే సినిమా క్యాస్టింగ్ లో చేరినట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు.

మరి ఇప్పుడు ఈ సినిమాలో అయితే ప్రముఖ తమిళ నటి శ్రీయ రెడ్డి కీలక పాత్ర చేస్తున్నట్టుగా మేకర్స్ ఇపుడు అనౌన్స్ చేశారు. దీనితో ఈ చిత్రంపై ఇపుడు మరింత బజ్ సంతరించుకుంది. పైగా క్యాస్టింగ్ పరంగా కూడా సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మరి ఈ శ్రీయ రెడ్డి ఎవరంటే హీరో విశాల్ నటించిన “పొగరు” అంటే అంటే మనవాళ్ళకి ఠక్కున గుర్తిచేస్తుంది.

తెలుగులో అయితే తక్కువ సినిమాలే చేసినప్పటికీ తమిళ్ లో సహా మూవీ లవర్స్ లో ఈమెకి మంచి ఫేమ్ ఉంది. దీనితో ఓజి పై మరిన్ని అంచనాలు సెట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అయితే ప్రియాంక మోహన్ నటించగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.