బిగ్ బాస్ 4 కోసం డిఫ‌రెంట్ లుక్ ట్రై చేసిన స్టార్ హీరో.. ఉల‌గ‌నాయ‌గ‌న్ అద‌ర‌హో అంటూ కామెంట్స్

విదేశాల‌లో ప్రారంభ‌మైన బిగ్ బాస్ షో మ‌నదేశంలోకి వ‌చ్చి సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. ముందుగా హిందీలో ప్రారంభ‌మైన బిగ్ బాస్ కార్య‌క్ర‌మం మెల్ల‌మెల్లగా అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో మొద‌లైంది. అంత‌టా బిగ్‌బాస్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. తెలుగులో ప్ర‌స్తుతం సీజ‌న్ 4 జ‌రుపుకుంటుండ‌గా తమిళంలో త్వ‌ర‌లో మొద‌లు కానుంద‌ని అంటున్నారు. సెప్టెంబ‌ర్‌లో షోని ప్రారంభించాల‌ని ముందుగా ప్లాన్ చేసిన‌ప్ప‌టికీ కోవిడ్ వ‌ల‌న వాయిదా ప‌డింది. వీలైనంత తొంద‌ర‌లోనే షోని స్టార్ చేసే ఆలోచ‌న‌లో నిర్వాహ‌కులు ఉన్నారు.

త‌మిళ బిగ్ బాస్ కార్య‌క్ర‌మానికి ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ హోస్ట్‌గా అల‌రిస్తూ వ‌స్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సీజ‌న్స్ పూర్తి కాగా, మూడింటిని ఆయ‌నే హోస్ట్ చేశారు. నాలుగో సీజ‌న్‌ని కూడా క‌మ‌ల్ హోస్ట్ చేయ‌నున్నారు. అయితే ఈ షో కోసం క‌మ‌ల్ సరికొత్త గెట‌ప్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు.బ్లాక్ డ్రెస్, వైట్ క్యాప్‌తో రావిషింగ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి అంద‌రిని ఆశ్చ‌ర్య‌పరిచారు. క‌మ‌ల్ హాస‌న్ లుక్ చూశాక ఆయ‌న అభిమానుల‌లో ఆనందం ఉప్పెన‌లా త‌న్నుకొస్తుంది. సోష‌ల్ మీడియాలో క‌మ‌ల్ ఫోటోని షేర్ చేస్తూ వైర‌ల్‌గా మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

త‌మిళ బిగ్ బాస్ సీజ‌న్ 4కు సంబంధించి ఇప్ప‌టికే ప్రోమో రెడీ చేయ‌గా, ఇది త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంద‌ని అంటున్నారు. ఇక ఈ షో కోసం 15 మంది స‌భ్యుల‌ను ఎంపిక చేయ‌గా, ఇందులో రమ్య పాండియన్… పుజ్ఘల్… అతుల్య రవి.. విద్యాలేఖ రామన్ … కిరణ్ రాథోడ్ వంటి సెలబ్రిటీలు పాల్గొన‌నున్న‌ట్టు తెలుస్తుంది. క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ షోని ప్రారంభించ‌నుండ‌గా, ఎలాంటి వివాదాలు లేకుండా షో స‌క్ర‌మంగా జ‌ర‌గాల‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక క‌మ‌ల్ ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భార‌తీయుడు 2 అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప‌లు స‌మ‌స్య‌ల వ‌ల‌న ఆగింది.