లేటెస్ట్ : రామ్ చరణ్ ఫ్యాన్స్ కి షాకిచ్చిన ‘గేమ్ చేంజర్’ యూనిట్ 

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర మంచి హైప్ నడుమ ఉన్న భారీ చిత్రాల్లో దర్శకుడు శంకర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం “గేమ్ చేంజర్” కూడా ఒకటి. మరి ఈ చిత్రంతో శంకర్ టాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతుండగా రామ్ చరణ్ కూడా శంకర్ తో మొదటి సారిగా వర్క్ చేస్తున్నాడు.

దీనితో ఈ భారీ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా అంతకంతకు ఆలస్యం అవుతూ వస్తుంది. దీనితో ఫ్యాన్స్ కొందరి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంటామని బెదిరించడం జరిగింది.

సరే సినిమా నుంచి మొదటి సాంగ్ ఈ దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా మొదట అప్డేట్ ఇచ్చి మళ్ళీ నాన్చడంతో ఫ్యాన్స్ లో చిరాకు స్టార్ట్ కాగా ఫైనల్ గా అయ్యితే అసలు సాంగ్ ఉందా లేదా అనేదానిపై చిత్ర యూనిట్ ఇప్పుడు బిగ్ అప్డేట్ అందించారు. దీనితో ఐతే అసలు ఈ సినిమా నుంచి ఇప్పుడు సాంగ్ రావడం లేదు అని కన్ఫర్మ్ చేసేసారు. కొ

న్ని అనివార్య కారణాలు మూలాన సినిమా సాంగ్ ని విడుదల చేయలేకపోతున్నాము అని కానీ మీరు వెయిట్ చేసే సమయం అందుకు వర్త్ అని ఖచ్చితంగా కొత్త డేట్ తో త్వరలోనే అలరించేందుకు వస్తామని క్లారిటీ ఇచ్చారు. సో ఈ దీపావళికి రామ్ చరణ్ ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది అని చెప్పక తప్పదు. కాగా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా కియారా అద్వానీ అంజలిలు హీరోయిన్స్ గా నటించారు. రామ్ చరణ్ డ్యూయల్ రోల్స్ చేసాడు. 
https://x.com/SVC_official/status/1723221253882888579?s=20