విజయ్ లోకేష్ కనగరాజ్ చిత్రంపై లేటెస్ట్ క్రేజీ బజ్.!

Lokesh kanagaraj about Master leaks

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర మంచి క్రేజీ గా ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో ఇళయ దళపతి విజయ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సాలిడ్ యాక్షన్ చిత్రం కూడా ఒకటి. దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తీస్తున్న సినిమా ఇది కావడంతో మరింత స్థాయిలో హైప్ అందరిలో నెలకొంది.

అయితే ఇప్పుడు ఈ చిత్రంపై లేటెస్ట్ గా ఓ క్రేజీ బజ్ అయితే సినీ వర్గాలలో వినిపిస్తుంది. మరి దీని ప్రకారం అయితే ఈ సినిమా నుంచి ఈ జనవరి 26 న ఇంట్రెస్టింగ్ ప్రోమో లాంటిది లాంచ్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. అంటే గతంలో లోకేష్ కనగ రాజ్ నుంచి ఉలగనయగన్ కమల్ హాసన్ నుంచి వచ్చిన “విక్రమ్” కి స్టార్ట్ లో చేసిన ఇంట్రెస్టింగ్ వీడియో లాంటిది కూడా కావచ్చు.

వచ్చి మరి ఇందులో ఇంకా ఎంతమేర నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాపై తెలుగు ఆడియెన్స్ లో కూడా భారీ అంచనాలు ఉండగా అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. అలాగే దీని తర్వాత లోకేష్ ఖైదీ 2 మరియు విక్రమ్ పార్ట్ 2 లాంటి క్రేజీ సీక్వెల్స్ కి కమిట్ అయ్యి ఉన్నాడు. ఇవన్నీ వచ్చే ఏడాది స్టార్ట్ కానున్నాయి.