చిరు – పూరీ కొత్త సినిమా గాసిప్స్ పై క్లారిటీ ఇదే.!

puri-jagannadh-role-in-chiru-godfather-apr9-16x

టాలీవడో బాస్ ది మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ సినిమాలో తన రేంజ్ సక్సెస్ ని లేటెస్ట్ గా “వాల్తేరు వీరయ్య” తో అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తన సినిమాలతో అదిరే లెవెల్లో ట్రీట్ ఇస్తున్న మెగాస్టార్ అయితే తన సినిమా లైనప్ లో మరిన్ని చిత్రాలు తాను చేయాల్సి ఉంది.

మరి ఈ సినిమాల్లో గత కొన్నాళ్ల కితం దర్శకుడు పూరి జగన్నాథ్ తో సినిమా ఉన్నట్టుగా మళ్ళీ బజ్ బయటకి వచ్చింది. చిరు తన గాడ్ ఫాదర్ చేసే సమయంలో పూరి కూడా ఆ సినిమాలో నటించడం తర్వాత ఇద్దరు కూడా సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ కావడం జరిగినప్పుడు కూడా తమ సినిమా టాపిక్ రావడం క్రేజీగా మారాయి.

మరి ఈ సినిమాపై రీసెంట్ గా కొన్ని గాసిప్స్ బయటకి వచ్చాయి. సినిమా కాంబినేషన్ ని చిరు కూతురు సుష్మిత కొణిదెల అయితే నిర్మాణం వహించనవుంది అని బజ్ వచ్చింది. మరి దీనిపై ఇండస్ట్రీ వర్గాల నుంచి లేటెస్ట్ క్లారిటీ వినిపిస్తుంది. ఈ కాంబినేషన్ లో సినిమా అనేది అవాస్తవం అని..

ఇంకా నిర్మాత ఎవరు ఈ సినిమాకి లాక్ అవ్వలేదని అలాగే పూరి కూడా ఇంకా చిరు ని మెప్పించే కథ రెడీ చేసే పనిలోనే ఉన్నాడని వినికిడి. మరి ఇవన్నీ ఎప్పటికి కంప్లీట్ అవుతాయో చూడాలి. ఇక ప్రస్తుతం అయితే చిరు దర్శకుడు మెహర్ రమేష్ తో భోళా శంకర్ అనే సినిమా లేటెస్ట్ గా చేస్తున్నారు.