లేటెస్ట్ : క్రేజీ లుక్ లో ప్రభాస్.. మారుతీ సినిమాపై అప్డేట్స్ వచ్చేశాయ్.. 

ప్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “సలార్ సీజ్ ఫైర్” తో తాను మళ్ళీ ట్రాక్ లోకి రాగా ఈ సినిమా తర్వాత ప్రభాస్ నుంచి ఈ ఏడాదిలో అయితే రెండు సినిమాలు రిలీజ్ కి వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. కాగా మొదటి సినిమా అయితే మే 9న కల్కి విడుదల కానుంది.

ఇక ఆ రెండో సినిమా దర్శకుడు మారుతీతో చేస్తున్న అవైటెడ్ సినిమా కూడా ఒకటి. కాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఇవాళ సంక్రాంతి కానుకగా అయితే బిగ్ అప్డేట్ రివీల్ చేసేసారు. అనుకున్నట్టుగానే సినిమా టైటిల్ ని “ది రాజా సాబ్” గానే పెట్టి సినిమా నుంచి ప్రభాస్ పై క్రేజీ లుక్ ని అయితే రివీల్ చేసేసారు.

మరి ప్రభాస్ ఈ ఫస్ట్ లుక్ లో మాత్రం ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చే లెవెల్లో ఉన్నాడని చెప్పాల్సిందే. లుంగీ కట్టి ఒక సెలెబ్రేషన్ మోడ్ లో పండుగ తీసుకొస్తున్నట్టుగా డార్లింగ్ హీరో ప్రభాస్ కనిపిస్తున్నాడు. దీనితో ప్రభాస్ ఫాన్స్ కి ఇప్పుడు మరో పండుగా మొదలైంది. కాగా ఈ అప్డేట్ తోనే మరిన్ని డీటెయిల్స్ కూడా చిత్ర యూనిట్ ఇచ్చేసారు.

ఈ సినిమా రిలీజ్ టైం ఎప్పుడు అనేది ఎక్కడా ఫిక్స్ చేయలేదు కానీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. అలాగే సంగీత దర్శకుడు థమన్ నే ఈ సినిమా కి కూడా వర్క్ చేస్తున్నట్టుగా తెలిపారు. సో వీటిపై మాత్రం ఇవాళ్టితో ఓ క్లారిటీ వచ్చినట్టే అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.