ఆలస్యంగా బన్నీకి రామ్‌ చరణ్‌ విషెస్‌.. నెటిజన్ల ట్రోల్స్‌

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వరించిన సందర్భంగా టాలీవుడ్‌ స్టార్స్‌ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి, రాజమౌళి, తారక్‌, త్రివిక్రమ్‌లతోపాటు పలువురు సెలబ్రిటీలు తమదైన శైలిలో బన్నీకి విష్‌ చేశారు. రామ్‌చరణ్‌ కాస్త ఆలస్యంగా శుక్రవారం మధ్యాహ్నాం శుభాకాంక్షలు చెప్పారు. అంతే కాదు భార్య ఉపాసనతో కలిసి స్పెషల్‌గా ఒక గిప్ట్‌, పుష్పగుచ్చాన్ని పంపారు. దాంతోపాటు ఓ గ్రీటింగ్‌ కార్టును షేర్‌ చేశారు. ’డియర్‌ బన్నీ కంగ్రాట్స్‌.. నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది.. ఇలాంటివి ఇంకా ఎన్నో నిన్ను వరిస్తాయి. అందుకు నీవు అర్హుడివి కూడా..’ అని ఉపాసన రాసుకొచ్చారు.

దీంతో అల్లు అర్జున్‌ కాస్త ఎమోషన్‌ అయ్యారు. థ్యాంక్యూ సో మచ్‌ అని చెప్పి టచ్‌ చేశారు అని రిప్లై ఇచ్చారు. ఇదంతా అల్లు అర్జున్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేశారు. అవార్డు ప్రకటించిన వెంటనే బన్నీకి విషెస్‌ చెప్పలేదని, కనీసం ట్వీట్‌ చేయలేదని లేట్‌ విషెస్‌ ఎందుకు? ఇద్దరి మధ్య ఏదో గ్యాప్‌ ఉందని కొందరు నెటిజన్లు సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

తాజాగా రామ్‌చరణ్‌, ఉపాసన గిప్ట్‌ పంపి విష్‌ చేయడం, దానికి బన్నీ ఎమోషన్‌ కావడం చూసి చరణ్‌ బన్నీల మధ్య ఎలాంటి గ్యాప్‌ లేదని అభిమానులు ట్వీట్స్‌ చేస్తున్నారు. అంతే కాదు మరికొందరు అయితే గ్యాప్‌ అంటూ ట్రోల్‌ చేసే వారికి గట్టి కౌంటర్‌ ఇచ్చి పడేశారు. ’ట్వీట్‌ చేయకపోతే విష్‌ చేయనట్లేనా? విషయం తెలిసిన వెంటనే ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెప్పి ఉండొచ్చుగా’ ఆ కోణంలో ఎందుకు ఆలోచించరు? ఇరు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తారెందుకు… ఎవరు ఏమనుకున్నా.. వారంతా ఓ ఫ్యామిలీకి చెందినవారు. ట్రోల్‌ చేసినంత మాత్రాన వారి మధ్య బంధాలు బలహీనపడవు‘ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.