‘లంబసింగి’ నుంచి పాటవిడుదల!

భరత్‌రాజ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘లంబసింగి’.. ఎ ప్యూర్‌ లవ్‌స్టోరీ… అనేది ఉప శీర్షిక. నవీన్‌ గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ దివి కథానాయికగా నటిస్తున్నారు. ఆనంద్‌.టి నిర్మిస్తున్నారు. దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కురసాల సమర్పకులు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఈ సందర్భంగా ఇందులోని ‘వయ్యారి గోదారి నువ్వే… నా దారికొచ్చి చేరావులే…’ అంటూ సాగే పాటని విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటకి కాసర్ల శ్యామ్‌ సాహిత్యం సమకూర్చగా, జావేద్‌ అలీ ఆలపించారు. ఆర్‌.ఆర్‌.ధ్రువన్‌ స్వరకర్త. ఈ మెలోడీ పాటకు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన వస్తోంది.