‘ఆచార్య’ దెబ్బతో మళ్లీ అలాంటి రిస్క్‌లు చేయాలంటే భయపడిపోతున్నాడట మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలోనే ప్రయోగాలు చేయాలని వున్నా చేయట్లేదట. అది కేవలం తన కోసమే కాదు, నిర్మాతల బాగోగులు ఆలోచించేవాడు కాబట్టి, వాళ్లని దృష్టిలో పెట్టుకుని చిరంజీవి రిస్క్ చేయాలని వున్నా చేయలేకపోతున్నాడనీ తెలుస్తోంది.
కళ్యాణ్ కృష్ణతో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయాల్సి వుంది. ఇది పక్కా కమర్షియల్ మూవీ. అలాగే స్టైలిష్ డైరెక్టర్.. చిరంజీవికి అత్యంత సన్నిహితుడు అయిన సురేందర్ రెడ్డితోనూ చిరంజీవి ఓ సినిమా చేయాల్సి వుంది. ఇది కూడా కమర్షియల్ డ్రామానే.
అలాగే, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్‌తోనూ చిరంజీవికి ఓ సినిమా కమిట్మెంట్ వుంది. శంకర్ సినిమా అంటే, అది ఖచ్చితంగా ప్రయోగాత్మక చిత్రమే అవుతుంది. అవునట. కొత్త కథ, కథనాలతో సాగే డిఫరెంట్ జోనర్ మూవీ కోసం చిరంజీవి, శంకర్‌తో ఓ సినిమాకి కమిట్ అయినట్టు ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
ఇవే కాక, మరికొన్ని ప్రయోగాత్మక చిత్రాల్లో చిరంజీవి నటించాలనుకుంటున్నాడట. ఆ తరహా కథలు ఆల్రెడీ చిరంజీవి విన్నాడట. వాటిపై పాజిటివ్ ఒపీనియన్ వున్నప్పటికీ నిర్మాతల యాంగిల్ దృష్ట్యా వాటిని హోల్డ్‌లో పెట్టేసినట్లు తెలుస్తోంది.