కొత్త ఇంటిని కొనుగోలు చేసిన లేడీ సూపర్ స్టార్.. పెళ్లి తర్వాత ఈ ఇంటికి మకాం!

దక్షిణాది సినిమా ఇండస్ట్రీ లో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి వారిలో లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఎన్నో సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న టువంటి నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. తాజాగా నయనతార 4 పడకగదులు కలిగినటువంటి ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

Nayanthara | Telugu Rajyamచెన్నైలోని పొయెస్‌ గార‍్డెన్‌లో ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక విగ్నేశ్ శివన్ తో తన పెళ్లి తర్వాత నయనతార ఇంట్లో ఉండబోతోందని తెలుస్తోంది. ఇక తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత, రజినీకాంత్ ఇల్లు కూడా ఇదే ఏరియాలోనే ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఏరియాలో నయనతార ఇంటిని కొనుగోలు చేయడం కోసం భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తన ఇంటి కల నెరవేరడంతో త్వరలోనే తన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతుందనే సమాచారం వినబడుతోంది.

ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే ఈమె మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి గాడ్ ఫాదర్ చిత్రంలో ఈమె మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా కాకుండా చెల్లెలి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంత నయనతార ప్రధాన పాత్రలో కాతువాకుల రెండు కాదల్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈమె ఇంటిని కొనుగోలు చేశారని తెలియడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles