మహేష్ బాబు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి శెట్టి.. ఆనందంలో అభిమానులు..?

ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉప్పెన సినిమాలో తన అందం అభియాన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతి శెట్టి ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో నాని నాగచైతన్య రామ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ అమ్మడు నటించిన ది వారియర్ సినిమా ప్లాప్ అయ్యింది. అయినా కూడా వరుస అవకాశాలు ఈ అమ్మడి తలుపు తడుతున్నాయి.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండే కృతి శెట్టి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో తన సినిమా విశేషాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు అభిమానులతో చిట్ చాట్ చేస్తూ తన ఇష్టా ఇష్టాలను వారితో షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో తన అభిమానులతో చాట్ చేసిన కృతి శెట్టి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ క్రమంలో ఒక అభిమాని మహేష్ బాబు గురించి మీ అభిప్రాయం ఏంటి? అని అడగ్గా.. కృతి స్పందిస్తూ.. ‘మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్’ అంటూ మహేష్ బాబు ని పొగుడుతూ సమాధానం చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న మహేష్ అభిమానులు మహేష్ ని రియల్ హీరో అన్నందుకు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇక కృతి శెట్టి కూడా తెలుగు తమిళ్ భాషలలో దాదాపు ఐదు సినిమాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.