కేతిక శర్మ కాదా.? కృతి శెట్టి రాబోతోందా.?

నిన్న మొన్నటిదాకా కేతిక శర్మ పేరు ఖరారయ్యిందన్నారు. ఇప్పుడేమో కృతి శెట్టి పేరు ప్రచారంలోకి వస్తోంది. ఇంతకీ, ఎవరి పేరు ఫైనల్ అవుతుందబ్బా.? సముద్ర ఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన సినిమా కోసం హీరోయిన్ల వెతుకులాట షురూ అయ్యింది. సినిమా ప్రారంభమవడానికి ముందే కేతిక శర్మ పేరు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

కానీ, ఏమయ్యిందో.. ఇప్పుడు కృతి శెట్టిని చిత్ర బృందం సంప్రదించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కేతిక శర్మ కంటే కృతి శెట్టి అయితే బావుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. అయితే, ఈ విషయమై అధికారిక సమాచారం అందాల్సి వుంది.

మరోపక్క, కృతి శెట్టి మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలో ఏ చిన్న పాత్ర అయినా చేసేస్తానంటూ గతంలోనే పలు సందర్భాల్లో చెప్పింది. సాయి ధరమ్ తేజ్‌కి జోడీగా ఆమె పేరు ప్రచారంలోకి ఇప్పుడు రావడంతో ఆమె ఆనందానికి ఆకాశమే హద్దు అవుతుందేమో.! ఇంతకీ, పవన్ కళ్యాణ్‌కి జోడీ వుంటుందా.? ప్చ్.. అవకాశం వుండకపోవచ్చు.