మహేష్ బాబు చేసిన ఆ పని వల్ల స్టూడియో మొత్తం పరుగులు పెట్టిన కృష్ణ ..!

సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈయన తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో సినిమాల విషయంలో ఏ హీరోలు చేయని సాహసాలు కృష్ణ చేశారు. అందుకు నిదర్శనం అల్లూరి సీతారామరాజు సినిమా. ఈ సినిమాలో నటించడానికి కొందరు ప్రముఖ హీరోలు తిరస్కరించిన కూడా కృష్ణ ఈ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకున్నాడు.

కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంజుల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్పుడప్పుడు కుటుంబంకి సంబందించిన విషయాలనూ కూడా వీడియోస్ ద్వారా షేర్ చేస్తుంది. వయసు మీదపడటంతో మీడియాకు దూరంగా ఉండే కృష్ణ అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ లో మాత్రమే కనిపిస్తూ ఉంటాడు. ఇటీవల తన కూతురు మంజుల ఘట్టమనేని కృష్ణ గారి తో స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది.

ఈ వీడియోలో కృష్ణ ఎంతో హుషారుగా ఉన్నారు. ఈ వీడియోలో తన సినీ జీవితం, కుటుంబం గురించీ కృష చెప్పుకొచ్చారు. సినిమాల విషయంలో తన జీవితంలో ఉన్న ఎత్తు పల్లాలు గురించి కృష్ణ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా సినిమా ప్లాప్ ఐనప్పుడు మీరూ ఎలా తీసుకునేవారు అని మంజుల అడగగా.. నా కెరీర్ లో 12 సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఐనా కూడా నేను ఏ మాత్రం నిరాశ చెందకుండ ప్రయత్నాలు చేశాను అని కృష్ణ సమధానం ఇచ్చాడు. తర్వత మహేశ్ బాబు ని మీరు చిన్నప్పుడే సూపర్ స్టార్ ని చేశారు.మీరు కావాలనే అలా చేశారా లేక అనుకోకుండా జరిందా అని అడగ్గా.. అది అల జరిగిపోయింది. చిన్నప్పుడు మహేష్ షూటింగ్ చూడటానికి వచ్చేవాడు. ఒకరోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో దూరంగా నిలబడి గడ్డం కింద చెయ్యి పెట్టుకొని చూస్తున్నాడు. నేను దగ్గరికి వెళ్లి నువ్వు కూడా నటిస్తవా,లేదా అని గట్టిగ అడగటంతో మహేశ్ పరిగెత్తుకుంటూ మొత్తం స్టూడియో అంతా తిప్పించాడు అంటూ కృష్ణ చెప్పుకొచ్చాడు.