కరోనా వలన మూతపడ్డ థియేటర్స్ ఇటీవల తిరిగి తెరచుకున్నాయి. లాక్ డౌన్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రం విడుదల కాగా, ఈ చిత్రానికి మోస్తరుగా ప్రేక్షకులు వచ్చారు. ఇక ఈ రోజు క్రాక్ చిత్రం విడుదల కానుండగా, ఈ సినిమాకు ఎంత మంది ప్రేక్షకులు వస్తారు అని అంచనాలు వేస్తున్న సమయంలో ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఫైనాన్సియల్ క్లియరెన్స్ కారణంగా ‘క్రాక్’ సినిమా ఈ రోజు థియేటర్స్‌లో పడకపోవచ్చు అని అంటున్నారు.
ఫైనాన్షియల్ సమస్యల వలన యూఎస్ ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు రద్దయ్యాయి. ఫైనాన్సియర్లకు నిర్మాత సకాలంలో డబ్బులు తిరిగి చెల్లించకపోవడం వలన మధ్యాహ్నం వరకు షోస్ పడక పోవచ్చు అని టాక్ ఒకటి ఫిలిం నగర్లో హల్ చల్ చేస్తుంది. నిర్మాత ఠాగూర్ మధు సినిమా పనిలో చెన్నైలో ఉండటం వల్ల.. మార్నింగ్ షో విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురుయ్యాయి. దీని వలన 8:45 షో క్యాన్సిల్ అయింది. మార్నింగ్ షో పడే అవకాశం ఉందని అంటున్నారు
చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తున్న క్రాక్ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. విక్రమార్కుడు చిత్రం తర్వాత రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనబడనుండడంతో ఈ సినిమా ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న క్రాక్ సినిమా రవితేజ 66వ చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై బి.మధు ఈ చిత్రాన్ని నిర్మించారు.