ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ మార్చక తప్పలేదు

ఆర్ఆర్ఆర్ సినిమాతో నటుడు జూనియర్ ఎన్టీఆర్ సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ మూవీలో నటనతో పాన్ ఇండియా లెవల్ లోనే కాకుండా గ్లోబల్ లెవల్ ఐడెంటిటీ పొందాడు తారక్. ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ లాంటి హిట్ సినిమా రావడం, ఆర్ఆర్ఆర్ లాంటి బంపర్ హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీకి NTR30 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. అయితే ఈ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉన్నారు. గత ఏడాది చివరి నుండే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. తర్వాత ఫిబ్రవరి మొదటి వారం నుండి షూటింగ్ మొదలు అవుతుందని హింట్ ఇచ్చినా.. మరోసారి వాయిదా పడింది. సినిమా అనౌన్స్ చేసి ఇన్ని రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకు షూటింగ్ మొదలు కాకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

అయితే జూనియర్ ఎన్టీఆర్ వల్లే ఈ సినిమా చాలా ఆలస్యం అవుతోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు ఫుల్ క్రేజ్ వచ్చింది. పాన్ ఇండియా స్టార్ గుర్తింపు లభించింది. అంతర్జాతీయ వేదికపైనా ఆర్ఆర్ఆర్ సినిమా ముఖ్యం ఎన్టీఆర్ కు మంచి క్రేజ్ వచ్చింది. తారక్ ఇమేజ్ పెరిగిపోయింది. కొరటాల శివతో స్టోరీని అంతకు ముందు విన్న ఎన్టీఆర్.. ఇప్పుడు కథలో పలు ఛేంజేస్ చేయమని శివకు చెప్పాడట.

తన సినిమా పాన్ ఇండియా లెవల్ లో వెళ్లే అవకాశాలు ఉండటంతో దానికి తగ్గట్లుగా కథలో మార్పులు చేయాలని అడిగాడట. దీంతో కొరటాల శివ తన రైటర్స్ టీం ను దానిపై పని చేయాల్సిందిగా చెప్పాడని సమాచారం. అలా మెయిన్ స్టోరీ లైన్ అలాగే ఉంచి, దాదాపు సగానికి పైగా స్క్రిప్ట్ మార్చినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఇదే కథతో అల్లు అర్జున్ తో సినిమా చేయాలనుకున్న కొరటాల శివ.. దానిని తారక్ కు తగ్గట్లుగా మార్చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సూచనలతో మరిన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ రెడీగా లేకపోవడం వల్లే NTR30 షూటింగ్ ప్రారంభం కావడానికి ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.