ఆచార్య ని సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేయబోతున్న కొరటాల శివ ..?

కొరటాల శివ ప్రభాస్ తో తీసిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే భారీ కమర్షియల్ సక్సస్ ని అందుకున్నాడు. అప్పటికే రచయితగా మంచి సక్సస్ లు అందుకున్న కొరటాల మీద నమ్మకంతో అందరూ స్టార్ హీరోలే ఆయనతో సినిమాలు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు తో శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఎన్.టి.ఆర్ తో జనతా గ్యారేజ్ సినిమాలు తెరకెక్కించి సూపర్ హిట్స్ ఇచ్చాడు. కొరటాల సినిమాలలో మంచి మెసేజ్ ఉంటుంది. హీరోకి మంచి కమర్షియల్ హిట్ ఇస్తాడు.

Acharya First Look Poster: Chiranjeevi Mass avatar - tollywood

అందుకే మెగాస్టార్ కొరటాల శివ ఛాన్స్ ఇచ్చారు. కాగా ఆచార్య పట్టాలెక్కడానికే రెండేళ్ళు పట్టింది. మెగాస్టార్ సైరా ప్రాజెక్ట్ లో ఉండటమే ఇందుకు కారణం. ఆ తర్వాత సినిమా మొదలై 40 శాతం కంప్లీటయ్యాక కరోనా కారణంగా దాదాపు 7 నెలల లాంగ్ గ్యాప్ వచ్చింది. కాగా మళ్ళీ తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
అనుకున్నట్టుగానే కొరటాల ఆచార్య ని సెట్స్ మీదకి తీసుకు వచ్చారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇక మరో రెండు మూడు రోజుల్లో చిరంజీవి షూటింగ్ లో జాయిన్ కావాల్సి ఉండగా కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఊహించని విధంగా మెగాస్టార్ కి పాజిటివ్ వచ్చింది.

దాంతో ఆచార్య షూటింగ్ ఆగిపోతుందని భావించారు. కాని దర్శకుడు కొరటాల శివ మాత్రం మెగాస్టార్ కి పాజిటివ్ వచ్చినా ఆయనకి అసలు కోవిడ్ లక్షణాలే లేవు కాబట్టి మరేం ఫరవాలేదు. ఆచార్య షూటింగ్ ఆగడం లేదు. సింగిల్ షెడ్యూల్ లోనే సినిమాని కంప్లీట్ చేయాలని షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నామని తెలిపారట. అంతేకాదు మెగాస్టార్ కూడా మరో 10 రోజుల్లో షూటింగ్ లో జాయిన్ అవుతారని సమాచారం. ఇక మోషన్ పోస్టర్ లో తెలిపినట్టే 2021 సమ్మర్ కి ఆచార్య రిలీజ్ కానుందట.