Koratala Siva : కాజల్ విషయంలో అసహనానికి లోనవుతున్న కొరటాల…!

Koratala Siva : ఆచార్య సినిమా విడుదల దగ్గరపడటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇక ప్రమోషన్స్ లో హాట్ టాపిక్ మాత్రం కాజల్ సినిమాలో ఉందా లేదా అనే. ఇక ఈ విషయం పై కొరటాల శివ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఆచార్య పాత్రకు లవ్ ట్రాక్ బాగోదనే ఉదేశ్యంతోనే సినిమానుండి కాజల్ ను తప్పించినట్లు ఇక ఈ విషయంలో కాజల్ కూడా అర్థం చేసుకుని తప్పుకున్నట్లు చెప్పారు. ఇంత వరకు అంత బాగానే ఉన్న ఈ విషయం గురించి చిరుని అడగడంతో కొరటాల అసహనానికి గురయ్యారు. నేను చెప్పా కదా మళ్ళీ ఆయనను కూడా అడగాలా అంటూ మీడియా పై విసుగు చెందారు.

కొరటాల ఆచార్య సినిమా విషయంలో చాలా అసహనానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఏడాదికి ఒక సినిమా కొరటాల పూర్తి చేస్తారని అనుకుని ఒక సినిమాకు 10కోట్లు రెమ్యూనరేషన్ అనుకుంటే ఆచార్య సినిమా 4 సంవత్సరాల నుండి వాయిదా పడుతూనే ఉండటం వల్ల ఆయన దాదాపు 30 కోట్లు నష్టపోయారు. దీంతో కొరటాలలో అసహనం ప్రమోషన్స్ లో కనిపిస్తోంది. ఇక కాజాల ఇష్యూ తోడవడంతో ఆయనకు మరో తలనొప్పి యాడ్ అయింది.

ఇక కాజల్ విషయంలో కొరటాల చెప్తున్న పాయింట్ బాగానే ఉన్నా మరీ అంత సీరియస్ పాత్ర అయిన ఆచార్యకు ఐటమ్ సాంగ్ ఎందుకు పెట్టారనే ప్రశ్న ఎదురవుతుంది కదా మరీ దీనికి ఏమి సమాధానం చెబుతాడో కొరటాల.అందుకోసం ముందు జాగ్రత్తగా ఆ ప్రశ్నని సైడ్ చేసాడు కొరటాల. ఈ సినిమా పూర్తి చేయడానికి కొరటాల పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కాదు. ఈ మూవీలో నటించటానికి హీరోయిన్లు ఎవ్వరూ అంత ఆసక్తి చూపించలేదు. తర్వాత సెట్లు ధ్వంసమయ్యాయి. ఇష్టం లేకుండా మణిశర్మని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీ కోసం నచ్చనివి చాలానే చేసాడు కొరటాల అందుకే ఆ అసహనం.