దేవర : సుకుమార్ హీరోయిన్స్ ని కాపీ కొట్టేసిన కొరటాల 

ఈ మధ్య కాలంలో అయితే టాలీవుడ్ నుంచి చెప్పుకోదగ్గ భారీ చిత్రాలు అంతగా ఏమి రాలేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ కూడా బాలీవుడ్ ఖాతాలోకే వెళుతుంది. కాగా వచ్చే ఏడాదిలో మాత్రం పలు సెన్సేషనల్ చిత్రాలు మినిమమ్ లో మినిమమ్ 500 కోట్ల గ్రాస్ నుంచి స్టార్ట్ అయ్యే చిత్రాలు చాలా ఉన్నాయి.

అలాంటి చిత్రాల్లో దర్శకులు సుకుమార్ మరియు కొరటాల శివ లాంటి దర్శకులు నుంచి కూడా పలు చిత్రాలు ఉండగా అవే “పుష్ప 2 మరియు దేవర”. కాగా నిన్న రాత్రే దేవర నుంచి హీరోయిన్ జాన్వీ కపూర్ పిక్ అయితే బయటకి వచ్చి వెంటనే వైరల్ గా మారిపోయింది.

కాగా ఈ లుక్ చూసిన తర్వాత మాత్రం ఆడియెన్స్ కి పెద్దగా ఎగ్జైట్మెంట్ అయితే ఏమీ కలగలేదు. ఎందుకంటే ఈ బాలీవుడ్ హీరోయిన్ డెబ్యూ పరమ రొటీన్ గా జరుగుతున్నట్టుగా అర్ధం అయిపోయింది. ఇక ఈ భారీ చిత్రంలో ఆమె లుక్ సుకుమార్ గత చిత్రాలు రంగస్థలం, పుష్ప హీరోయిన్స్ సమంత, రష్మికా మందన్నా తరహాలోనే కనిపిస్తుంది.

పైగా ఒకటే పోజ్ లో వదలడంతో అంత పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అయితే ఏమి రాలేదు. దీనితో కొరటాల కాపీ కొట్టాడని కూడా అనేస్తున్నారు. అయితే జస్ట్ సెట్స్ నుంచి జాన్వీ అలా పోస్ట్ చేసుకుంది. మరి సినిమాలో ఏమన్నా కొత్తగా ఉంటుందేమో చూడాలి మరి. ఇంకా ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. 
https://x.com/OCinemaupdates/status/1719548062648115363?s=20