Kajal Agarwal : కాజల్ సినిమాలో లేదట…క్లారిటీ ఇచ్చిన కొరటాల…!

Kajal Agarwal : కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. రూ.140 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో చిరుకి జంటగా కాజల్, చరణ్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.

అయితే 2:33 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ లో కాజల్ ఊసే లేకపోవడంతో అభిమానులు హర్ట్ అయ్యారు. ఇక సినిమాలో కాజల్ ఉందా లేశ అనే అనుమానాలు వచ్చాయి వీటన్నింటికి చెక్ పెడుతూ కొరటాల ఈ విషయం పై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఆచార్య పాత్ర ఒక నక్సలైట్ పాత్ర ఎంతో సీరియస్ గా సాగే ఈ పాత్రకు రొమాంటిక్ లవ్ స్టోరీ పెట్టడం సరికాదని అనిపించి కొన్ని సన్నివేశాల కోసం పెద్ద హీరోయిన్ ను ఇబ్బంది పెట్టడం సరికాదనిపించి కాజల్ కు చెప్పగా తాను అర్థం చేసుకుని సినిమా నుండి తప్పుకుందని వివరించారు.

ఆల్రెడీ షూటింగ్ చేసిన సన్నివేశాలను తొలగించామని చెప్పారు. ఇక ఆచార్య సినిమా విడుదల దగ్గర పడటంతో ప్రచార కార్యక్రమాల జోరు పెరిగింది. ఇక ఘనంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇక చిరు, చెర్రీ లను ఎక్కువ హైలైట్ చేస్తూ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాదనే క్లారిటీ ఇచ్చారు కొరటాల. భాయి అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత మ్యాజిక్ చేస్తుందో చూడాలి.