Koratala Shiva: ఆర్ఆర్ఆర్ సినిమా ఘన విజయం అందుకున్న తర్వాత ఎన్టీఆర్ తదుపరి చిత్రాల మీద దృష్టి పెట్టాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఆలియా హీరోయిన్ గా నటిస్తోంది అన్న వార్తలు కూడా వినిపించాయి. ఆ తర్వాత ఆలియా భట్ కీ ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి మధ్య కోల్డ్ వార్ జరిగింది అన్న వార్తలు కూడా వినిపించాయి. అందుకే ఆలియా ఎన్టీఆర్ సినిమా నుంచి తప్పుకుంది అని అన్నారు. ఇక తాజాగా ఆలియా భట్ స్థానం లో రష్మిక మందనను హీరోయిన్ గా చిత్రబృందం ఎంచుకున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
కాకపోతే ఈ వార్తల మీద చిత్ర బృందం స్పందించలేదు.అయితే ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ఆచార్య సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండటం తో ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరటాల శివ, ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గురించి ప్రస్తావన రాగా ఈ సందర్బంగా ఆ విషయం పై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు కొరటాల శివ.
ఈ విషయంపై కొరటాల శివ ఈ విధంగా స్పందించారు…’నేను స్క్రిప్ట్ ని కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే చెప్పాను. నేను ఇంకా ఏ హీరోయిన్ కి కథ చెప్పలేదు. అలాగే ఈ సినిమా కోసం ఏ హీరోయిన్ని ఫైనలైజ్ చేయలేదు అని కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు.అయితే చిత్ర బృందం ఎన్టీఆర్ సినిమా హీరోయిన్ రష్మిక మందనను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో హీరోయిన్ గురించి అధికారిక ప్రకటన చిత్ర బృందం చేసే వరకు దీనిపై సస్పెన్స్ పోయేలా లేదు. ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా ఎవరు ఫైనల్ అవుతారో అన్నది చూడాలి మరి.