ఆచార్యలో అనుష్క…క్లారిటీ ఇచ్చిన కొరటాల…!

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య. తొలిసారి చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు చిత్రం యూనిట్. కానీ చిరంజీవి సరసన హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా అనుమానాలు అందరిలోనూ మిగిలి పోయాయి. ఇక సినిమాలో కాజల్ ఉందా లేదా అనే విషయంపై చాలానే చర్చ జరిగింది. ఇక ఈ విషయం లో కొరటాల క్లారిటీ ఇచ్చాక చిరు కి అసలు హీరోయిన్ లేదని కొంచెం అసంతృప్తికి లోనయ్యారు మెగా ఫ్యాన్స్.

ఇక ఈ లోటును భర్తీ చేయడానికి సినిమాలో అనుష్కతో ఒక స్పెషల్ సాంగ్ చిరు కి ఉందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.దర్శకుడు కొరటాల శివ వివరణ ఇచ్చారు. అలాంటి సర్‌ప్రైజ్‌లు ఏమీ లేవని తేల్చేశాడు. అనుష్క ఉందనేది కేవలం పుకారు మాత్రమే అని, అందులో నిజం లేదని చెప్పారు. విరుద్ధ భావాలు కలిగిన ఇద్దరి పాత్రల ప్రయాణాన్ని చూపించే చిత్రమిది అని, ఎమోషనల్‌గా సాగుతుందని, మిర్చి సినిమా తరహాలో యాక్షన్‌ ఎపిసోడ్స్ పుష్కలంగా ఉంటాయన్నారు.

మిర్చి సినిమా తరువాత ఆ తరహా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చూపలేదని ఆ లోటు ఈ సినిమాతో తీరనుందని చిరు కి సెపరేట్ గా, చెర్రీ కి సపరేట్ గా యాక్షన్ సీన్స్ ఉన్నాయని ఇక ఇద్దరు చివర్లో కలిసి చేసే యాక్షన్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయని చెప్పారు. ఇక ఎన్టీఆర్ తో తీయబోయే చిత్రమ్ కూడా యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని హింట్ ఇచ్చాడు కొరటాల.