లేటెస్ట్ : కింగ్ నాగ్ ఈజ్ బ్యాక్..ఇది కదా అసలైన మాస్ బ్లాస్ట్..!

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎన్నో యూనిక్ చిత్రాలు చేసారు. అలాగే రొమాన్స్ లో గాని లేడీ ఫాలోయింగ్ లో కానీసీనియర్ హీరోస్ లో అయితే నాగ్ ని కొట్టేవాళ్ళు ఇంకొకరు లేరు అని చెప్పడంలో సందేహం లేదు.

కాగా ఇప్పుడు నాగార్జున ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గ సినిమాలు కూడా చేస్తున్నప్పటికీ తన రేంజ్ హిట్ కోసం చూస్తున్నారు. అయితే నాగ్ కి వర్కౌట్ అయ్యిన మాస్ అండ్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లోనే చేసిన చిత్రాలు సోగ్గాడే చిన్ని నాయన అలాగే బంగార్రాజు లు పెద్ద హిట్స్ కాగా ఈ చిత్రాల తర్వాత నాగ్ కి మళ్ళీ కష్టాలు తప్పలేదు.

ఇక మళ్ళీ ఇపుడు అదే మాస్ ఫార్ములాతో నాగార్జున అయితే మళ్ళీ సంక్రాంతికి వస్తున్నట్టుగా సంక్రాంతి పందేనికి కాలు దువ్వాడు. కాగా నాగ్ కెరీర్ లో 99వ చిత్రాన్ని దర్శకుడు బిన్నీ తెరకెక్కిస్తున్న సినిమానే “నా సామిరంగ”. మరి ఇది కూడ నాగార్జున మాస్ డైలాగ్ నే కాగా దీనిని వింటేజ్ టైటిల్ గా డిజైన్ చేసి రిలీజ్ చేయడం విశేషం.

ఇక దీనిపై రిలీజ్ చేసిన వీడియో అయితే నాగ్ వెర్షన్ నుంచి కేజీఎఫ్ అనుకోవచ్చని చెప్పడంలో సందేహం లేదు. ఒక అఖండ లో బాలయ్య కి ఎలివేషన్ ఇచ్చినట్టు మెగాస్టార్ కి వాల్తేరు వీరయ్య ఎలా పడిందో ఇప్పుడు నాగ్ కి ఈ “నా సామిరంగ” కూడా అలానే అనిపిస్తుంది.

పక్కా మాస్ ఎంటెర్టైనింగ్ గా ఈ టీజర్ అయితే అదరగొట్టింది. అలాగే నాగ్ లాస్ట్ డైలాగ్ తో సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Naa Saami Ranga First Look & Title Glimpse | Nagarjuna Akkineni | Vijay Binni | Srinivasaa Chitturi