‘లక్ష్మీ బాంబ్’ లో హాట్ గా పేలేది కియారా నే ..!

టాలీవుడ్, కోలీవుడ్ లో మంచి కొరియోగ్రాఫర్.. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్స్ కి సాంగ్స్ కొరియోగ్రఫీ అందించి పాపులర్ అయిన రాఘవ లారెన్స్ ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. నాగార్జున తో డాన్ అన్న సినిమాని తీసి హిట్ అందుకున్నాడు. మాస్ పల్స్ బాగా పట్టుకున్న లారెన్స్ 2007 లో ముని అన్న హర్రర్ కామెడీ తీసి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నుంచి అదే జోనర్ లో సీక్వెల్స్ ని తీస్తూ హిట్స్ అందుకుంటు వస్తున్నాడు. ఈ సిరీస్ లో కాంచన వచ్చి తమిళం, తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది.

Blog Archives - biodot1o

రాఘవ లారెన్స్ కథ, కథనం తో పాటు ఈ సినిమాలో తనే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. లారెన్స్ ఈ సిరీస్ లో ఇప్పటికే 4 సినిమాలు తెరకెక్కించాడు. అన్ని సూపర్ హిట్సే. అయితే ఇప్పుడు ఈ సినిమాని బాలీవుడ్ లో తెరకెక్కించాడు. అది కూడా స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో. నాలుగైదేళ్ళుగా అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో సోషల్ ఎలిమెంట్స్ తో సినిమాలు తీస్తూ వరసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో ఇంత కంటిన్యూ హిట్స్ అందుకుంది ఒక్క అక్షయ్ కుమార్ మాత్రమే.

Laxmi Bomb' first look: Akshay Kumar dazes with his saree! - RozBuzz

ఇక ప్రస్తుతం కాంచన కి రీమేక్ గా రూపొందిన లక్ష్మీ బాంబ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. కాగా ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కి జంటగా బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కియారా అద్వాని నటించింది. కాగా ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజైంది. అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ సూపర్బ్ అన్న టాక్ తో పాటు కియారా హాట్ గా ఉందన్న కామెంట్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా కియారా గ్లామర్ ఈ సినిమాకి పెద్ద ఎసెట్ అవుతుందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఓ భారీ హిట్ కూడా దక్కబోతుందని చెప్పుకుంటున్నారు.