కేన్స్‌ చిత్రోత్సవం..ఓ మరువలేని అనుభూతి : కియారా అద్వానీ..

‘కేన్స్‌ చిత్రోత్సవాల్లో పాల్గొనడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తా’ అన్నారు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. తనదైన నటనతో మెప్పించే ఈ భామ.. ఇటీవలే కేన్స్‌ చిత్రోత్సవాల్లో మెరిసి సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ‘ఉమెన్‌ ఇన్‌ సినిమా’ అంశంపై జరిగిన చర్చా వేదికలో పాల్గొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వేడుకలోని తన అనుభవాలు, రాబోయే ప్రాజెక్టుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను కియారా పంచుకుంది. కేన్స్‌ చిత్రోత్సవాలకు హాజరవ్వడం సంతోషంగా ఉంది. నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఇది నా కెరీర్‌లోనే ఎంతో మధురమైన జ్ఞాపకంగా ఉండిపోతుంది. దాదాపు 20ఏళ్ల క్రితం నా కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యాను. చిన్నప్పుడు దీని గురించి ఇంటర్నెట్‌ ద్వారా తెలుసుకునేదాన్ని.

కానీ.. నేను ఒక సెలబ్రెటీగా ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేడుకలో పాల్గొంటానని ఆ సమయంలో నాకు తెలీదు. కేన్స్‌ చిత్రోత్సవం నాకు ఎప్పటికీ మర్చిపోలేని ఒక అనుభవం’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. యాక్షన్‌ చిత్రాల్లో నటించడానికి చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను. ‘వార్‌ 2’, ‘డాన్‌ 3’లతో ఆ కోరిక నెరవేరబోతుంది. ఇవి నా కెరీర్‌లోనే పెద్ద ప్రాజెక్టులు. ప్రేమకథలు, కామెడీ..ఇలా అన్ని జానర్లలో పనిచేశాను.

కానీ చాలా కాలంగా పూర్తిగా యాక్షన్‌ నేపథ్యంలో సాగే చిత్రాల్లో నటించడం కోసం వేచి చూస్తున్నాను. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. ఒకానొక సమయంలో ‘షేర్షా’ సినిమాలో నేను భాగమైనప్పుడు.. ‘ఓ మై గాడ్‌ ఇదొక యుద్దానికి సంబంధించిన యాక్షన్‌ చిత్రం. ఇలాంటి ప్రాజెక్టులో ఈమె నటిస్తుందా..?’ అని కొంతమంది నా విూద విమర్శలు చేశారు. కానీ.. ప్రస్తుతం భారీ బ్జడెట్‌తో రూపొందుతున్న రెండు పెద్ద ప్రాజెక్టులు నా చేతుల్లో ఉన్నాయి. ఈ సినిమాల్లో నన్ను నేను నిరూపించుకోవడమే ముఖ్యం అని తెలిపింది.