ఖుషి… ఆ ముగ్గురి ఫేట్ కి సక్సెస్ కంపల్సరీ

టాలీవుడ్ లో ఎవరి ఫేట్ అయిన మారిపోవడానికి ఒక శుక్రవారం చాలు అని సినీ విశ్లేషకులు అంటూ ఉంటారు. శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమా సెలబ్రిటీల జీవితాలనే మార్చేస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలు సెన్సేషన్ టాక్ సొంతం చేసుకొని హీరో, హీరోయిన్స్ కి ఊహించని క్రేజ్ తీసుకొస్తాయి. కొన్ని చిత్రాలు కెరియర్ ని డ్యామేజ్ చేస్తాయి.

అందుకే శుక్రవారం వచ్చే రిజల్ట్ కోసం కోసం దర్శకులు, హీరో, హీరోయిన్స్ అందరూ తమ సినిమాలతో వెయిట్ చేస్తారు. వారి కష్టానికి ఎలాంటి ఫలితం వస్తుందనేది చూస్తారు. అలాంటి వెయిటింగ్ సిచువేషన్ లో ఇప్పుడు ఖుషి సినిమాతో ముగ్గురు ఉన్నారు. వారే దర్శకుడు శివ నిర్వాణ, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత.

విజయ్ దేవరకొండ చివరిగా లైగర్ సినిమాతో కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా అతనికి చేదు ఫలితం ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఖుషి మూవీతో సూపర్ సక్సెస్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఇక సమంత కూడా శాకుంతలంతో కెరియర్ లో అతి పెద్ద డిజాస్టర్ ని సొంతం చేసుకుంది.

ఎంత కష్టపడి ఈ సినిమా చేసిన ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. సమంత కెరియర్ కి కూడా ఖుషి చాలా ఇంపార్టెన్స్. అలాగే దర్శకుడు శివ నిర్వాణ వరుసగా నిన్ను కోరి, మజిలీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. అతని మూడో చిత్రం టక్ జగదీశ్ మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఒక సాదాసీదా స్టొరీని తీసుకొని ఫ్యామిలీ ఎమోషన్స్ తో చెప్పాలని ట్రై చేసిన వర్క్ అవుట్ కాలేదు.

ఇలా ముగ్గురి కెరియర్ లో వచ్చి చివరి చిత్రాలు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరికి ఖుషి సినిమా చాలా కీలకం. కచ్చితంగా దీంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిందే. మైత్రీ నిర్మాతలకి మినిమమ్ బడ్జెట్ సినిమాల విషయంలో అంత సక్సెస్ రేట్ లేదు. మరి ఈ సినిమా వారికి ఎలాంటి హిట్ ఇచ్చి మరల బౌన్స్ బ్యాక్ చేస్తుందనేది చూడాలి.