ట్రోల్ చేసేవారికి ఇచ్చిపడేసిన ఖుష్భూ

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలని లక్ష్యంగా చేసుకొని చాలా మంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ట్రోల్ చేయడం కొంతమందికి అలవాటుగా మారిపోయిందని చెప్పాలి. దీనికి అందరూ బాధితులే. తాజాగా సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్భూ కూడా ట్రోల్స్ బారిన పడింది. ఖుష్బూ 90వ దశకంలో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.

తరువాత దర్శకుడు సుందర్ సిని పెళ్లి చేసుకొని సినిమాలకి కొంత గ్యాప్ ఇచ్చింది. మరల ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. అదే సమయంలో రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి డిఏంకె పార్టీలో ప్రారంభంలో చేరింది. తరువాత అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరింది. ప్రస్తుతం బీజేపీ పార్టీలో తమిళనాడులో స్టేట్ లీడర్ గా ఆమె కొనసాగుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఆమెకి కేంద్రంలో విమెన్ కమిషన్ జాతీయ సభ్యురాలిగా బీజేపీ ప్రభుత్వం అత్యున్నత హోదా ఇచ్చింది. నిజంగా ఆమెకి ఇది గొప్ప అవకాశం అని చెప్పాలి. అయితే ఇలా పదవి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా కొంతమంది పనికట్టుకొని ఆమెని టార్గెట్ గా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక ఈ విమర్శలు, ట్రోల్స్ పై ఖుష్బూ రియాక్ట్ అయ్యింది. ట్విట్టర్ దీనిపై ఆమె ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు.

మనం ఎదుగుతున్న సమయంలో కొంత మంది మనల్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు మన స్థాయిని అందుకోలేరు. అలాగే మనల్ని కూడా ఆ స్థాయిలో చూడటానికి వారు ఇష్టపడరు. ఇలా ఎవరైతే శాడిస్టిక్ ఆలోచనలు, మనస్తత్వాలతో ఉంటారో తన మీద అదే పనిగా వేధింపులకి గురిచేసే విధంగా ట్రోల్స్ చేస్తూ ఉంటారో వారందరికీ నేను ఒకటే చెప్పాలని అనుకుంటున్నా. మీరు ఆ రోగం నుంచి వేగంగా కోలుకోవాలి అని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది.