సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా రీ రిలీజ్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అనేలా ఉంది. మే 30న థియేటర్లలోకి తిరిగి వస్తున్న ఈ 4K వెర్షన్‌కి, అభిమానుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వస్తోంది. ప్రీ రిలీజ్ నుంచే హైప్ ఉన్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఖలేజా రీ రిలీజ్ వసూళ్లు రికార్డులు తిరగరాస్తున్నాయి.
ఈ సినిమా విడుదలకు ఇంకా మూడు రోజులు ఉండగానే హైదరాబాద్‌లో రూ.1 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటి కొత్త రికార్డు సృష్టించింది. 2025లో రీ రిలీజ్ అయిన తెలుగు సినిమాలన్నింటిలోనూ ఖలేజా అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు టాప్ 5 అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఖలేజా (రూ.1 కోటి), ఆర్య 2 (రూ.88 లక్షలు), SVSC (రూ.70 లక్షలు), సలార్ (రూ.65 లక్షలు), వర్షం (రూ.47 లక్షలు) ఉన్నప్పటికీ, ఖలేజా స్పీడ్ అంతకుమించి ఉంది.
ఈ క్రేజ్‌కు కారణం.. ఖలేజా సినిమాకు ఉన్న కల్ట్ ఫాలోయింగ్, త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్‌పై ఉన్న నమ్మకం. థియేటర్లలో మళ్లీ ఈ సినిమాను చూసేందుకు రెండు తరాల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టికెట్ల కోసం అడ్వాన్స్ బుకింగ్స్‌లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మే 30న రాబోతున్న ఖలేజా కలెక్షన్ల తుఫాను రీ రిలీజ్ ట్రెండ్‌కు మళ్లీ న్యూ ట్రెండ్ సెట్టర్ కానుందనడంలో సందేహం లేదు.