మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే అభిమానులకు పండగే. ఆ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖలేజా’ ఇప్పుడు మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది. 2010లో విడుదలై అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ఈ సినిమాకు ఉన్న మౌత్ టాక్ మాత్రం ఆపై పెరుగుతూనే వచ్చింది. మహేష్ కెరీర్‌లో అత్యంత లోతైన డైలాగ్స్‌తో, వేరే కోణంలో చూసే కథనంతో ప్రేక్షకుల మెదళ్లలో పదిలంగా నిలిచిపోయిన చిత్రం ఇది.
‘ఖలేజా’ కథలోని సామాజిక అంశాలు, త్రివిక్రమ్ రాసిన సంభాషణలు, మహేష్ బాబు కామెడీ టైమింగ్, మణిశర్మ సంగీతం.. ఇవన్నీ కలసి సినిమాను ఓ మునుపెన్నడూ లేని లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఇప్పుడు అదే సినిమాను మే 30న 4K వర్షన్‌లో మళ్లీ తెరపై చూడబోతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఓ లెజెండరీ పాత్రను మరోసారి థియేటర్‌లో చూడాలన్న ఫీలింగ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
ఈ నేపథ్యంలో ‘ఖలేజా’ రీ రిలీజ్ హక్కులకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ స్పందన వచ్చింది. లేటెస్ట్ టాక్ ప్రకారం, ఈ సినిమా రీ రిలీజ్ రైట్స్ దాదాపు రూ.2 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఆంధ్రలో క్రౌన్ ఫిల్మ్స్, సీడెడ్‌లో నాగార్జున ఫిల్మ్స్, నిజాంలో అశ్విన్ కుమార్ ఈ హక్కులను తీసుకున్నట్టు సమాచారం. ఈ మొత్తం డీల్‌తో నిర్మాతలకు కూడా మంచి లాభాలు రావడం ఖాయం. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, మే 30న రీ రిలీజ్ కావాల్సిన ‘హరిహర వీరమల్లు’ మరియు ‘కింగ్‌డమ్’ సినిమాలు వాయిదా పడడం వల్ల ‘ఖలేజా’కు మంచి స్క్రీన్ కౌంట్ లభించే అవకాశముంది. ఈ సినిమాకు తిరుగులేని ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.