KGF 2 : బాహుబలి ది ఎండ్ లాగా సీక్వేల్ గండాన్ని కేజీఎఫ్, పుష్ప దాటగలవా…!విశ్లేషకుల మాటేమిటి…!

KGF 2 : ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో వచ్చిన కేజీఫ్ అంచనాలు ఏమి లేకుండా వచ్చి ఎంతటి ఘన విజయం సాధించిదో అందరికి తెలిసిందే.యష్ హీరో గా వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది అనే చెప్పాలి. ఈ సినిమా తోనే యష్ పాన్ ఇండియా హీరో గా ఇదిగాడు. పాన్ ఇండియా లెవెల్ లో ఎక్కువగా ఎదురు చూస్తున్న సినిమాల జాబితా లో కేజీఫ్ 2 కూడా చేరడం విశేషం.

ఈ సినిమా వస్తోందని తెలిసి, ఉత్తరాదిన సైతం కొన్ని డైరెక్ట్ గా రూపొందిన హిందీ చిత్రాలు పక్కకు తప్పుకున్నాయి. దీనిని బట్టే, ‘కేజీఎఫ్-2’కు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది. కానీ ఇపుడుఈ సినిమా విజయం మీద కొంత మంది అభిమానులలో కొత్త అనుమానాలు వస్తున్నాయ్. దీనికి కారణం మన దేశంలో ఓ హిట్ మూవీకి తరువాత వచ్చిన సీక్వెల్స్ మొదటి భాగం అంతగా క్లిక్ కాలేదనే సెంటిమెంట్ బయటికి రావడమే.మన దేశంలో ముఖ్యంగా మన తెలుగునాట సీక్వెల్స్ కు పెద్ద సీన్ లేదు అంటూ ఉంటారు సినీజనం. ఆ మాటకొస్తే తెలుగులోనే కాదు, భారతదేశంలోనే సీక్వెల్స్ లో మొదటి భాగాని కంటే మిన్నగా విజయం సాధించి, బ్లాక్ బస్టర్ గా నిలచిన ఏకైక చిత్రం రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ అనే చెప్పాలి.

మన తెలుగునాట మాత్రం సీక్వెల్స్ కు శ్రీకారం చుట్టినవారు రామ్ గోపాల్ వర్మ అనే చెప్పాలి. ఆయన శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో నిర్మించిన ‘మనీ’ సినిమాకు సీక్వెల్ గా ‘మనీ మనీ’ వచ్చి అలరించలేక పోయింది. ఈ మధ్య వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్ గా వచ్చిన ‘బంగార్రాజు ’ మొదటి దానిలా మురిపించలేకపోయింది . తాజాగా ఇపుడు ఎఫ్-2’కు సీక్వెల్ గా రానున్న ‘ఎఫ్-3’పైనా, ‘పుష్ప – ద రైజ్’కు సీక్వెల్ గా రాబోతున్న ‘పుష్ప – ద రూల్ ఇంకా కేజీఫ్ కు సీక్వెల్ గా రాబోతున్న కేజీఫ్ 2మీద ఆసక్తి రేగుతోంది.ప్రస్తుతం ఐతే ఇంకొన్నిరోజుల్లో కేజీఫ్ 2 విడుదల కాబోతోంది. ఈ నేపథయం లో ఈ సినిమా బాహుబలి 2 లాగా విజయం సాధిస్తుందో లేక పాత సెంటిమెంట్ ను ఫాలో అవుతుందో అన్న ఆసక్తి అందిరిలో మొదలయింది. చూడాలి మరి ఇలాంటి విజయం సాధిస్తుందో.