KGF 2: ఆర్ఆర్ఆర్ సినిమా హిందీ కలెక్షన్ లనీ కేజీఫ్ 2 అధిగమిస్తుందా…?

KGF 2: కన్నడ హీరో యష్ హీరో గా నcటించిన, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఫ్ 1 సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా తో హీరో యష్ ఇంకా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్లుగా మారిపోయారు.కేజీఫ్ 1 సినిమాకు సీక్వెల్ గా కేజీఫ్ 2 సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. ఈ సినిమా పై మాత్రం అంచనాలు భారీగా వున్నాయ్.దేశవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఈ సినిమా కోసమే సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కేజీఫ్ 2 కి సంబందించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరగడం విశేషం.మరి ముఖ్యంగా నార్త్ లో కేజీఫ్ 2 కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు సినీ అభిమానులు.ఎందుకంటే కేజీఫ్ 1 నార్త్ అభిమానులను ఎక్కువగా ఆకట్టుకుంది. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ చిత్రం షారుఖ్ ఖాన్ వంటి పెద్ద హీరో నటించిన ‘జీరో’ పక్కన రిలీజ్ అయినా అక్కడ భారీ వసూళ్ళను రాబట్టింది. ఇప్పుడు ‘కె.జి.ఎఫ్ 2’ పక్కన పెద్ద సినిమాలు ఏమీ లేవు. అందుకే ఈ చిత్రానికి అక్కడ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి.

అపుడే మొదటి రోజుకి గాను నార్త్ లో ‘కె.జి.ఎఫ్2′ కి 60 శాతం పైనే బుకింగ్స్ జరిగాయి. సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ స్టార్లు కూడా ఈ మూవీలో నటించడం బాలీవుడ్ జనాల్ని మరింతగా ఆకర్షిస్తుంది.దీంతో మొదటి రోజు అక్కడ భారీ కలెక్షన్లు నమోదు కావడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. బాలీవుడ్ లో కేజీఫ్ 2 మొదటి రాజు రూ.3 కోట్ల నుండీ రూ.40 కోట్ల నెట్ ను సాధించొచ్చు అనేది అంచనా.ఆర్.ఆర్.ఆర్’ మొదటి రోజు హిందీ నెట్ రూ.20 కోట్లు సాధించింది.ఇదే జరిగితే మన ‘ఆర్.ఆర్.ఆర్’ మొదటి రోజు కలెక్షన్లను ‘కె.జి.ఎఫ్’ అధిగమించినట్టే. అయితే హిట్ టాక్ వస్తేనే అక్కడ ‘కె.జి.ఎఫ్2’ దూకుడు కొనసాగుతుంది. లేదంటే అక్కడి జనాలకి మన ‘ఆర్.ఆర్.ఆర్’ అనే ఆప్షన్ ఇంకా ఉంది.వేచి చూడాలి మరి ఏమి జరుగుతుందో.