KGF 2 business : టాలీవుడ్ లో ఆ పెద్ద హీరో మార్కెట్ ను దాటేసిన కేజీఎఫ్ 2 బిజినెస్…!

 

KGF 2 Business: యష్ నటించిన ‘కెజిఎఫ్2’ ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌ కి రెడీ అవుతోంది. యష్ నటించిన కేజిఎఫ్ ఎంత భారీ విజయాన్ని అందుకున్న అందరికీ తెలిసిందే, సీక్వెల్ గా వస్తున్న కేజిఎఫ్ 2 మీద కూడా అంచనాలు అంతే రేంజ్ లో ఉన్నాయి. ఇక తూఫాన్ సాంగ్ విడుదల చేసిన తర్వాత యూట్యూబ్ లో ఇక తూఫాన్ మొదలయింది.

ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఇందులో భాగంగానే సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. అప్పుడే సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జోరుగా సాగుతోంది. కే జి ఎఫ్ 2 తెలుగు వర్షన్ కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ లో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో కే జి ఎఫ్ 2 తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువగా ఉందంట.

ఈస్ట్ గోదావరి కి సంబంధించిన కే జి ఎఫ్ 2 థియేట్రికల్‌ రైట్ 7 కోట్లకు గాను, ఉత్తరాంధ్ర థియేట్రికల్ 10 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. కే జి ఎఫ్ 2 ఫ్రీ రిలీజ్ బిజినెస్ భీమ్లా నాయక్ సినిమా బిజినెస్ తో పోలిస్తే, భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈస్ట్ గోదావరి కి సంబంధించి 6.4 కోట్లకు గానూ, ఉత్తరాంధ్ర 9.2 కోట్లకు అమ్ముడు పోయాయట. ఇలా చూసుకుంటే కే జి ఎఫ్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ భీమ్లా నాయక్ సినిమాని కంటే కూడా ఎక్కువగా ఉంది. చిత్ర బృందం కే జి ఎఫ్ 2 సినిమా ని దేశవ్యాప్తంగా 6000 థియేటర్లలో ప్రదర్శించాలని చూస్తున్నారట. తమిళ్ హీరో విజయ్ సినిమా బీస్ట్ కూడా అదే రోజు విడుదల అవ్వడం హంబల్ నిర్మాణ సంస్థ కు ఇది ఒక సవాల్.