KGF2: తుఫాన్ గా వచ్చిన రాకీ భాయ్… యూట్యూబ్ రికార్డులు బద్దలు…!

KGF2:కన్నడ హీరో యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన కే జి ఎఫ్ ఎంతటి ఘన విజయంసాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-2’.భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పై అంచనాలు దేశవ్యాప్తంగా భారీగానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన సినిమాల జాబితాలో ఇది కూడా ఒకటి. కే జి ఎఫ్ 2 సినిమా ని ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

యష్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. భారీ నిర్మాణ హంగులు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదల ఉండడంతో దీనికి సంబంధించిన ప్రమోషనల్ పనులు జరుగుతున్నాయి .ఇందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన తొలి గీతాన్ని ‘తుఫాన్‌’ను సోమవారం విడుదల చేశారు. తుఫాన్‌..తుఫాన్‌..ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే..శివమెత్తి అలల పడగెత్తినదే’ అంటూ రోమాంచితమైన విజువల్స్‌తో పాట ఆకట్టుకుంది.

కె జి ఎఫ్ 2 నుండి విడుదలైన తుఫాన్ సాంగ్ లో హీరో యశ్ ఎలివేషన్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, అలాగే ఆ లొకేషన్స్ ఈ సినిమా మీద అంచనాలు పెంచేశాయి. ఈ పాటకి రవి స్వరాలను సమకూర్చగా, పాట విడుదలైనప్పటి నుంచి యూట్యూబ్లో మార్మోగిపోతోంది. ఈ పాట చూసి కే జి ఎఫ్ 2 అభిమానులే కాకుండా ప్రభాస్ అభిమానులు కూడా ఆనందంలో ఉన్నారు. ప్రశాంత్ నీల్ ఈ పాటను తెరకెక్కించిన విధానం చూసి, ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన తదుపరి చిత్రం సలార్ పక్కగా హిట్టవుతుందని, ప్రభాస్ కి ఒక మాస్ హిట్ ఖాయమని ఫిక్స్ అవుతున్నారు.