సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద సినిమా అయినా కూడా కొన్నిసార్లు అనుకోకుండా లీకేజ్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఊహించని విదంగా సీన్స్ సోషల్ మీడియా ఎకౌంట్స్ లలో నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల KGF 2 టీజర్ లీక్ అవ్వడం అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది.
హీరో యష్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు విడుదల చేయాలని అనుకున్నారు. అయితే గురువారం రాత్రే ఒక్కసారిగా టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం షాక్ కు గురి చేసింది. ఇక చేసేదేమీ లేక చిత్ర యూనిట్ లీకైన కొన్ని నిమిషాలకే యూ ట్యూబ్ లో అఫీషియల్ గా రిలీజ్ చేసింది. టీజర్ అయితే బాగానే బజ్ క్రియేట్ చేసింది.
అయితే సడన్ గా లీక్ అవ్వడానికి కారణం ఏమిటనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ప్రస్తుతం కన్నడ మీడియాలో వస్తున్న టాక్ ప్రకారం అందుకు కారణం ఎడిటింగ్ లో వర్క్ చేసిన ఒక టెక్నీషియన్ అని తెలుస్తోంది. సినిమా టీజర్ ఎడిటింగ్ పూర్తయిన తరువాత అతను తన ఫ్రెండ్ కు పంపడంతో అక్కడి నుంచి వైరస్ లా టీజర్ సోషల్ మీడియాను తాకింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో టీజర్ దేశమంతా పాకేసింది. ఇక ఇప్పటికే చిత్ర యూనిట్ లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.