KGF 2 తెలుగు రైట్స్.. రేటుతో చెమటలు పట్టిస్తున్నారు

కన్నడ పాన్ ఇండియన్ ఫిల్మ్ KGF పార్ట్ 2 కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటిసారి శాండీల్ వూడ్ నుంచి వచ్చిన ఒక యాక్షన్ మూవీ నేషనల్ వైడ్ గా క్రేజ్ అనుకోవడంతో చాప్టర్ 2పై అంచనాల డోస్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. అంతకుమించి అనేలా ఉంటుందని ఆడియెన్స్ నమ్మకంతో ఉన్నారు.

అయితే KGF 2కు మిగతా భాషల్లో డిమాండ్ ఎంత ఉందో తెలియదు గాని తెలుగులో మాత్రం భారీ స్థాయిలో ఉన్నట్లు అర్ధమయ్యింది. ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం పోటీ కూడా ఎక్కువయ్యింది. దీంతో రోజురోజుకు ధర కూడా పెరుగుతోంది. ఒకవిధంగా రేటుతో చెమటలు పట్టిస్తున్నారు. చాప్టర్ 1 తెలుగు రైట్స్ ను 5కోట్లకు అమ్మిన నిర్మాతలు ఇప్పుడు కేవలం గుంటూరు ఏరియా రైట్స్ ను 5కోట్లని చెబుతున్నారట.

అంటే నైజాం ఉత్తరాంధ్ర రేట్లు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు తెలుగు రైట్స్ మొత్తంగా 60కోట్లకు పైగానే ధర పలుకుతున్నట్లు సమాచారం. మొదట 50కోట్ల లోపే ఉండవచ్చని టాక్ వచ్చింది. దాదాపు డీల్ కూడా క్లోజ్ అయినట్లు కథనాలు వచ్చాయి. కానీ ఇంకా ఆ డీల్ క్లోజ్ అవ్వలేదని సమాచారం. మరి నిర్మాతలు ఎలాంటి ధరకు తెలుగు హక్కులను అమ్ముకుంటారో చూడాలి.