కేజీఎఫ్ 2 కి ఎదురే లేదు.. బాహుబలి 2 రికార్డ్స్ అన్ని బద్దలవుతాయంటున్నారు ..?

కేజీఎఫ్ 2 ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా. కేజీఎఫ్ ఛాప్టర్ 1 సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ ఏకంగా పాన్ ఇండియన్ రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన కేజీఎఫ్ 1 సంచలన విజయాన్ని అందుకుంది. టాలీవుడ్ లో ఈ సినిమాని అంతగా ప్రమోట్ చేయలేదు గాని లేదంటే భారీ కమర్షియల్ హిట్ ని సాధించేది. అయితే కేజీఎఫ్ 1 వల్ల ప్రస్తుతం తెరకెక్కిన కేజీఎఫ్ 2 మీద ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. అంతేకాదు భారీ అంచనాలు క్రియేటయ్యేలా చేశాడు ప్రశాంత్ నీల్.

ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ సృష్ఠించిన రికార్డ్స్ ఇప్పట్లో మరే సినిమా బ్రేక్ చేయలేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక హోంబలే నిర్మాతలు ఈ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఇప్పటికే రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నారు. జూలై 16 న కేజీఎఫ్ ఛాప్టర్ 2 రిలీజ్ కాబోతోంది. అయితే ఇప్పటి నుంచే ఈ సినిమా సృష్ఠించే రికార్డ్స్ గురించి ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ సమయానికి ఇప్పటి వరకైతే ఏ సినిమా పోటీ లేదు. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలకి బాలీవుడ్ సినిమాలు భారీగా పోటీ పడుతున్నాయి.

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్. సుకుమార్ అల్లు అర్జున్ ల పుష్ప .. ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యాం లాంటి సినిమాలకి మిగతా భాషల నుంచి భారీ సినిమాలే పోటీ ఉన్నాయి. కాబట్టి ఏ సినిమా సత్తా ఏంటో చూపించడానికి ఆసక్తి కరమైన పోటీ నెలకొంది. కాని ఇప్పటిక్ వరకు కేజీఎఫ్ 2 కి ఏ సినిమా పోటీ లేకపోవడం తో ఇప్పటికే ఈ సినిమా మీద ఏర్పడిన క్రేజ్ వల్ల ఏకంగా బాహుబలి 2 సినిమా రికార్డ్స్ ని బద్దలు కొడుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు బాహుబలి 2 క్రియేట్ చేసిన రికార్డ్స్ ఎవరూ బ్రేక్ చేయలేదు. ఇప్పుడు కేజీఎఫ్ 2 కి ఆ అవకాశాలున్నాయని అంటున్నారు.