జబర్ధస్త్ కమెడీయన్స్‌కు వివాదాలేమి కొత్త కాదు. అప్పట్లో కమెడీయన్ వేణు, నరేష్ , హైపర్ ఆది టీంలో ఉన్న దొరబాబి, పరదేశీలు వివాదాలతో వార్తలలో నిలిచారు. ఇక ఇప్పుడు కెవ్వు కార్తీక్ కిడ్నాప్ కేసులో ఇరుక్కొని చర్చనీయాంశంగా మారాడు. కార్తీక్ మొదట్లో పలు టీంలలో సభ్యుడిగా పని చేశాడు. అవినాష్ టీంలో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. అవినాష్ బిగ్ బాస్ షోకు వెళ్లడంతో కార్తీక్‌కు కెప్టెన్ ప్రమోషన్ కూడా దక్కింది. ప్రస్తుతం అతని స్కిట్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు కార్తీక్‌నే పర్మినెంట్ కెప్టెన్‌గా ఉంచాలని డిసైడ్ అయ్యారు.
వెరైటీ అంశాలపై సెటైరికల్‌గా కామెడీ చేస్తుండే కమెడియన్ కెవ్వు కార్తీక్‌పై గూడూరు పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్, దాడి కేసు నమోదైంది. రవి యాదవ్ అనే వ్యక్తి తన సోదరి భర్తపై కార్తీక్ అతని స్నేహితులు కలిసి దాడి చేసారని భూపతి పేటలో ఫిర్యాదు చేశాడు. కార్తీక్ వెంట వచ్చిన ఐదుగురు వ్యక్తులు తమపై దాడి చేసినట్టు రవి కుమార్ ఫిర్యాదు చేశారు. నన్ను కారులో 15 కిలోమీటర్స్ తీసుకెళ్ళి కొట్టించాడంటూ భాదితుడు పేర్కొనడంతో దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.
అయితే రవి యాదవ్ అనే వ్యక్తి కెవ్వు కార్తీక్‌తో పాటు ఆయన తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేశారు. వారు కూడా ఇందులో భాగం అని చెప్పడంతో వారిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు దీనిపై కెవ్వు కార్తీక్ స్పందించలేదు. ఈ వార్త కనుక నిజమైతే కార్తీక్ కెరియర్‌కు పెద్ద ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. కెరీర్ మంచిగా సాగిపోతున్న ఈ సమయంలో అనవసరపు వివాదాలలో దూరి లేని పోని సమస్యలు తెచ్చుకోవడం ఎందుకంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు