అల్లు అర్జున్ మీద ప్రేమతో కేతిక శర్మ.!

‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ మీద మనసు పడిందట. మరోలా అనుకోకండి. అల్లు అర్జున్ అంటే తనకెంతో ఇష్టమనీ, తనకు లైఫ్ ఇస్తాడనీ ఆశపడుతోంది ఈ ముద్దుగుమ్మ.

లైఫ్ ఇవ్వడమంటే కూడా వేరే అర్ధాలు తీసేయకండి బాబోయ్. అల్లు అర్జున్ సినిమాలో తనకు ఛాన్సిస్తాడేమో అని ఆశపడుతోందట. ఈ మధ్య బన్నీతో కలిసి కేతిక శర్మ ఓ కమర్షియల్ యాడ్ చేసింది.

ఈ సందర్భంగానే తన మనసులోని మాటను బయట పెట్టింది. బన్నీతో కలిసి డాన్స్ చేయాలని వుందని చెప్పింది. అలా చేయాలంటే ఆయనతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవాలిగా. అదే అభిప్రాయాన్ని ఇలా బయట పెట్టిందన్న మాట.

అయితే, బన్నీ మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదట కేతిక శర్మని. ఆల్రెడీ కేతిక శర్మ మెగా కాంపౌండ్ హీరోతో నటించేసింది. వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా వచ్చిన ‘రంగ రంగ వైభవంగా’ సినిమాతో మెగా కాంపౌండ్‌ని టచ్ చేసిందీ క్యూట్ భామ.

అయితే, ఈ సినిమా ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. దాంతో, మెగా కాంపౌండ్ పట్టించుకునేంత రీచ్ కేతిక శర్మకు దక్కకుండా పోయింది పాపం.