బాయ్ ఫ్రెండ్ విషయంలో కీర్తి సురేష్ క్లారిటీ

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. కల్ట్ కంటెంట్ తో వచ్చిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ చేసిన వెన్నెల పాత్రకి మంచి ప్రశంసలు వచ్చాయి. ఇక తమిళంలో కూడా చివరిగా సానికాయుధం అనే మూవీలో  అత్యాచారానికి గురై ప్రతీకారం తీర్చుకునే అమ్మాయిగా నటించింది. అది పూర్తి డీగ్లామర్ రోల్ కావడం విశేషం.

ఇలా ఈ మధ్యకాలంలో ఓ వైపు డీగ్లామర్ రోల్స్ లో హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలు చేస్తూనే మరో వైపు కమర్షియల్ హీరోయిన్ గా గ్లామర్  పాత్రలకి కూడా సై అంటూ దూసుకుపోతోంది. గత కొంతకాలంగా కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి. కేరళకి చెందిన ఒక వ్యాపారవేత్తకి కీర్తి సురేష్ పెళ్లాడనుంది అంటూ టాక్ నడిచింది.

అయితే వాటిపై కీర్తి సురేష్ తల్లి మేనక క్లారిటీ ఇచ్చారు. తాము ఎలాంటి పెళ్ళికొడుకుని చూడలేదని చెప్పేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కొత్త రూమర్ ప్రచారంలోకి వచ్చింది. ఓ ఫ్రెండ్ తో కీర్తి సురేష్ ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. కీర్తి సురేష్ అతనితో ప్రేమలో ఉందని, త్వరలో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నరంటూ కథనాలు ప్రసారం చేసేశారు.

ఈ గాసిప్స్ కీర్తి వరకు చేరడంతో ఆమె ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యారు. నా బెస్ట్ ఫ్రెండ్ ని ఈ సారి వార్తల్లోకి లాగాలని అనుకోవడం లేదు. నా లైఫ్ లో మిస్టరీ మ్యాన్ వచ్చినపుడు నేనే రివీల్ చేస్తాను. అంత వరకు నా పెళ్లి వార్తల విషయంలో చిల్ గా ఉండాలని అన్నారు. మీరు ఒక్కసారి కూడా సరైన వార్తలు రాయలేదు అంటూ కీర్తి సురేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ భోళా శంకర్ మూవీలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది. అలాగే రివాల్వర్ రీటా, రఘు తాత అనే ఫిమేల్ సెంట్రిక్ కథలు కూడా చేస్తోంది. వీటితో పాటు తమిళంలో జయం రవికి జోడీగా సెరిన్ మూవీలో గ్లామర్ హీరోయిన్ గా సందడి చేయబోతోంది.