Keerthy Suresh: వెంకన్న సన్నిధిలో కీర్తి సురేష్.. వచ్చే నెలే నా పెళ్లి అంటూ క్లారిటీ!

Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈమె నేడు నవంబర్ 29వ తేదీ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఈమె తిరుమల స్వామి వారి ఆలయానికి రావడమే కాకుండా వీఐపీ విరామ సమయంలో స్వామివారి దర్శనంతో పాటు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు అలాగే పండితులు స్వామివారి తీర్థప్రసాదాలను కీర్తి సురేష్ కు అందజేశారు.

ఇలా కీర్తి సురేష్ తిరుమల ఆలయానికి రావడంతో ఈమె అక్కడ మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. వచ్చే నెల ఆంటోనితో తన పెళ్లి గోవాలో జరగబోతుందని తెలిపారు. ఇలా డిసెంబర్ 11వ తేదీ తన పెళ్లి జరగబోతున్నట్లు ఈమె అధికారికంగా వెల్లడించడమే కాకుండా.. తన పెళ్లి త్వరలోనే జరగబోతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకోవడం కోసమే తిరుపతికి వచ్చానని ఈమె క్లారిటీ ఇచ్చారు.

గత కొంతకాలంగా కీర్తి సురేష్ పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. అయితే పెళ్లి వార్తలు నిజం లేదని ఎప్పటికప్పుడు తన పెళ్లి రూమర్లను ఖండిస్తూ వచ్చిన కీర్తి సురేష్ స్వయంగా తన పెళ్లి గురించి ప్రకటించడమే కాకుండా తాను ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాను అనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఇలా ఈమె గత 15 సంవత్సరాలుగా బిజినెస్ మెన్ తో ప్రేమలో ఉంటూ ప్రేమించిన వ్యక్తినే పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారు.

ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ హీరో వరుణ్ థావన్ ‘బేబీ జాన్’ మూవీలో కీర్తీ సురేష్ నటిస్తుంది. ఈ మూవీ 2024 డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. ఇలా ఒకప్పుడు సౌత్ సినిమాలలో మాత్రమే నటిస్తూ మంచి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. మరి పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినిమాలలో నటిస్తారా లేదా ఇండస్ట్రీకి దూరమవుతారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.