నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కీర్తి సురేష్… అతి తక్కువ కాలంలోనే మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో కనిపించి మహానటి అనే ముద్ర వేయించేసుకుంది. అయితే ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ చేస్తున్న సినిమాల కంటే ఆమె పెళ్లి పుకార్ల గురించి ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. చాలా కాలం నుంచి ఆమె అతన్ని పెళ్లి చేసుకోబోతోంది.. ఇతని పెళ్లి చేసుకోబోతోంది.. అంటూ రకరకాల ప్రచారాలు జరగబోతున్నాయి.
ప్రస్తుతానికి కీర్తి సురేష్ వయసు 37. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ ఏడాదిలోపే పెళ్లి చేసుకోబోతోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక ఆ ప్రచారానికి ఊతం ఇచ్చే విధంగా ఆమె కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు అంగీకరించడం లేదట. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు ఎంత త్వరగా పూర్తిచేస్తే అంత త్వరగా పూర్తి చేయాలని ఆమె ప్రస్తుతం చేస్తున్న సినిమాల దర్శక నిర్మాతలను కోరుతుందట. కొత్త ప్రాజెక్టులు ఎందుకు ఒప్పుకోవడం లేదు అని ఆమెను అడిగితే పెళ్లి అని కారణంగా చెబుతున్నారట. ఆమె సన్నిహితులు నిజానికి కీర్తి సురేష్ చేతిలో ప్రస్తుతానికి అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.
వాటిలో దసరా అనే పాన్ ఇండియా మూవీ, ఒక తమిళ సినిమా ఉండగా… షూటింగ్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. మరోపక్క చిరంజీవి చెల్లెలిగా బోళా శంకర్ సినిమాలో చేస్తోంది. ఇక ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన పూర్తి షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయమని మెహర్ రమేష్ ను కోరినట్లుగా తెలుస్తోంది. చిరంజీవికి కూడా ఈ విషయం తెలియడంతో కీర్తి సురేష్ కోసం భోళాశంకర్ షూటింగ్ ను త్వరగా పూర్తి చేయడానికి ఆయన కూడా అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
ఇవి కాకుండా మరో మూడు తమిళ సినిమాల్లో ఆమె నటిస్తోంది. వాటిలో రెండు సినిమాలను ఇప్పట్లో చేయలేనని చెప్పేసిందట. ఒక సినిమా మాత్రం పూర్తి చేసి మరో రెండు సినిమాలు తన పెళ్లి తర్వాత పూర్తి చేస్తానని మాట ఇచ్చినట్టు తెలుస్తోంది .. ఈ నేపథ్యంలో పెళ్లికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.