కైమ్ర్‌..కామెడీతో కీడా కోలా మూవీ

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి బంపర్‌ హిట్ల తర్వాత తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంతో వస్తున్న తాజా చిత్రం ’కీడా కోలా’.. తరుణ్‌ భాస్కర్‌, బ్రహ్మనందం, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సరికొత్త కైమ్ర్‌ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్‌ 03న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ మొదలు పెట్టింది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ’కీడా కోలా’ టీమ్‌ యూనిట్‌ వరంగల్‌ (చిజీసజీనిణజీ) వస్తున్నట్లు ప్రకటించింది.

హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌ ఆడిటోరియంలో సాయంత్రం 6:30 గంటలకు కీడా కోలా టీం ఈవెంట్‌ ఉందని వరంగల్‌ వచ్చేయండి అంటూ మేకర్స్‌ ట్విట్టర్‌ లో రాసుకోచ్చారు. వీజీ సైన్మా సంస్థ ప్రొడ్యూస్‌ చేస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, రఘురామ్‌, రవీంద్ర విజయ్‌, చైతన్య రావు మదాడి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నాడు.