Kasturi Shankar: సినీ నటి కస్తూరి శంకర్ సినిమాలో చేసి కంటే కూడా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారానే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈమె సోషల్ మీడియా వేదికగా తరచు రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా సినిమా విషయాలు అలాగే ఇతర విషయాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు.
ఇలా నిత్యం వివాదాలు ద్వారా వార్తలలో నిలిచే కస్తూరి శంకర్ ఇటీవల తెలుగు వారి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగు సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఈమెపై కేసు నమోదు చేశాయి. ఈ నెల 3న చైన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన నటి.. 300 సంవత్సరాల కిందట ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు.. ప్రస్తుతం మాది తమిళ జాతి అంటున్నారన్నారు. ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరు అంటూ ద్రవిడ సిద్ధాంత వాదులపై ఈమె అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ విధంగా తెలుగువారిని ఉద్దేశించి ఈమె చేసిన ఈ వ్యాఖ్యలపై తెలుగు సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఈమె పట్ల పోలీస్ కేసు నమోదు చేశారు. ఇలా తనపై కేసు నమోదు కావడంతో ఈమె వివరణ ఇస్తూ నా ఉద్దేశం అది కాదని బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ఈమె పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేయడంతో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయగా కోర్టు ఈమె బెయిల్ నిరాకరించింది. దీంతో ఈమె చెన్నైలో ఉన్న ఇంటికి తాళం వేసేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నారు అయితే ఈమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు..
ఇలా పరారీలో ఉన్న కస్తూరి శంకర్ హైదరాబాదులో ఉన్నారనే విషయం తెలుసుకున్న పోలీసులు ఈమెను హైదరాబాద్లోనే అరెస్టు చేశారు. ఇలా హైదరాబాద్లో అరెస్టు అయిన కస్తూరి శంకర్ ను పోలీసులు చెన్నై తీసుకెళ్తున్నారు. ఇక ఈమె హీరోయిన్గా చేసింది చాలా తక్కువ సినిమాలే అయితే ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పలు సీరియల్స్ లోనూ అలాగే సినిమాలో వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.